CJI

Supreme Court: స్వలింగ వివాహ పిటీషన్ ను స్వీకరించిన ధర్మాసనం..! ఇది తప్పా..ఒప్పా..?

Supreme Court: స్వలింగ వివాహ పిటీషన్ ను స్వీకరించిన ధర్మాసనం..! ఇది తప్పా..ఒప్పా..?

సుప్రీం కోర్టు అంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. ఇది ఏదైతే తీర్పు ఇస్తుందో అది చట్టం అయి కూర్చుంటుంది. దీనిని దిక్కరించే అధికారం ఎవరికీ ఉండదు. గతంలో పాలకులకు తగ్గట్టుగా తీర్పులు వస్తున్నాయన్న అభియోగాలు న్యాయస్థానాలపై ఉండేవి. అందుకే కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగేలా ఒక కమిటీని నియమించారు. దీని ప్రకారం కేవలం ఒక్కరే నిర్ణయం తీసుకోకుండా కమిటీలో సగం పైగా సభ్యులు ఆమోదిస్తేనే అది తీర్పు వెలువరించేందుకు వీలుంటుంది. ఇలాంటి అత్యున్నత న్యాయస్థానం గతంలో అనేక సంచలనమైన తీర్పులనే ఇచ్చింది. వివాహేతర సంబంధాల విషయంలో కావచ్చు. విద్య విషయంలో కావచ్చు. స్త్రీ హక్కుల విషయంలో కావచ్చు. ట్రాన్స్ జెండర్స్ విషయంలో కావచ్చు. ఇలా పరిస్థితులకు అనుగుణంగా రకరకాల తీర్పులను వెలువరించింది. ఇప్పుడు తాజాగా మరో సంచలనమైన పిటిషన్ ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. అదే స్వలింగ వివాహానికి సంబంధించిన పిటీషన్. దీనిని ప్రస్తుతం తోసిపుచ్చకుండా స్వీకరించడం అయితే జరిగింది. దీనిపై తదుపరి వాయిదాను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అసలు దీనిపై విచారణ జరుపవచ్చా లేదా అనే అంశం గురించి ఒక్కసారి లోతుగా చర్చించుకుందాం.

SUPREME COURT: మరణశాశనంలో మార్పులు చేసిన సుప్రీం కోర్ట్..!

SUPREME COURT: మరణశాశనంలో మార్పులు చేసిన సుప్రీం కోర్ట్..!

వైద్యరంగానికి సంబంధించిన అంశంపై సుప్రీం కోర్టు కీలకతీర్పు వెలువరించింది. సుదీర్ఘ కాలంగా వైద్యసేవలు చేసుకుంటూ, చావలేక బ్రతుకుతున్న వారికి, మృత్యువుకు చేరువవుతున్న వ్యక్తులకు ఎలాంటి కష్టానికి గురిఅవ్వకుండా మరణాన్ని ప్రసాదించడానికి అనుసరించాల్సిన నియమనిబంధనల్లోని సంక్లిష్టతలను సర్వోన్నత న్యాయస్థానం తొలగించింది. జీవన సంకల్పం(LIVING WILL) మార్గదర్శకాలను సరళతరం చేస్తూ 2018లో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. వైద్యుల నుంచి వ్యక్తమైన పలు అభ్యంతరాలను జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రక్రియలో […]

SUPREME COURT CJI:దేశ అత్యున్నత న్యాయవ్యవస్థపై ఒత్తిడి నిజమేనా..?

SUPREME COURT CJI:దేశ అత్యున్నత న్యాయవ్యవస్థపై ఒత్తిడి నిజమేనా..?

కొలీజియంపై కేంద్రం వైఖరి.. దేశానికి ప్రాణాంతకం సుప్రీం మాజీ జడ్జి జస్టిస్‌ నారీమన్‌ కీలకవ్యాఖ్యలు చేశారు. కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రొహిన్‌టన్‌ ఫాలి నారీమన్‌ పేర్కొన్నారు. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజుజు చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముంబై విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఆయన బాంబే హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎమ్‌సి చాగ్లా ఏడో స్మారకోపన్యాసం చేశారు. […]