ఒకవైపు సవాళ్ళు మరోవైపు సంసారం.!

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే నిలదొక్కుకోవడం కష్టం అనుకునే రోజులివి. అలాంటిది ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి, కన్నడ నుంచి తెలుగు, తమిళం, చివరికి బాలీవుడ్ వరకు నేషనల్ క్రష్‌గా సంచలనం సృష్టిస్తోంది రష్మిక మందన్నా.

Post Published By: dialnews
Updated : 28 July 2026, 6:10 PM IST

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే నిలదొక్కుకోవడం కష్టం అనుకునే రోజులివి. అలాంటిది ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి, కన్నడ నుంచి తెలుగు, తమిళం, చివరికి బాలీవుడ్ వరకు నేషనల్ క్రష్‌గా సంచలనం సృష్టిస్తోంది రష్మిక మందన్నా. 'గీత గోవిందం'లో లల్లీగా అలరించినా, 'పుష్ప'లో శ్రీవల్లిగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నా, 'యానిమల్'తో బాలీవుడ్ లో భారీ విజయం సాధించినా... అది కేవలం రష్మికకే సాధ్యమైంది.అయితే, ఈ స్థాయి విజయం సాధించడం రష్మికకు అంత సులువుగా ఏమీ దక్కలేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన రష్మిక, తన సినీ ప్రయాణం గురించి, ప్రారంభంలో తాను ఎదుర్కొన్న భయాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతీ ఒక్కరికీ ఒక ప్లాన్ ఉంటుంది. "ఫలానా రకం సినిమాలు చేయాలి, ఫలానా డైరెక్టర్లతోనే పనిచేయాలి" అని ఒక లెక్క ఉంటుంది. కానీ రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎటువంటి ఫార్ములాలు లేదా ప్లాన్లను మైండ్‌లో పెట్టుకోలేదు.

ఈ విషయంపై రష్మిక మాట్లాడుతూ.. "ఏ మూస పద్ధతిలోనూ ఇమడకుండా, ఎలాంటి ప్రణాళికలు లేకుండా పూర్తిగా కొత్తగా ఈ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం నా జీవితంలోనే ఒక అద్భుతమైన ప్రయాణం" అని చెప్పింది. మొదట్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తన చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరూ చాలా పర్ఫెక్ట్ ప్రణాళికలతో కనిపించేవారట. ఎవరి రూట్ వాళ్లకు స్పష్టంగా ఉండేది. అది చూసి రష్మికకు మొదట్లో చాలా భయం వేసిందట. "అందరికీ ప్లాన్స్ ఉన్నాయి, నాకే ఏ ప్లాన్ లేదా?" అని ఆందోళన చెందింది.కానీ ఆ భయంలోనూ రష్మిక ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇతరులను చూసి వాళ్ల దారిలో వెళ్లకుండా... "నా అంతరాత్మ ఏం చెబితే దాన్నే విన్నాను" అని తెలిపింది. ఒక కథ విన్నప్పుడు లేదా ఒక పాత్రను ఎంచుకునేటప్పుడు ఇతరుల సలహాల కంటే తన మనసుకి ఏది సరైనది అనిపిస్తే ఆ పాత్రనే ఓకే చేస్తందట రష్మిక.

ఈ రోజు తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే... ఆ రోజు తాను తీసుకున్న ఆ నిర్ణయాలే తనని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయని రష్మిక భావిస్తోంది. రష్మిక చెప్పిన ఈ మాటలు కేవలం సినిమా రంగానికే కాదు, మన దైనందిన జీవితానికి కూడా చాలా బాగా వర్తిస్తాయి.
మన చుట్టూ ఉన్నవాళ్లు లైఫ్‌లో ఏదో ఒక ప్లాన్‌తో ముందడుగు వేస్తున్నప్పుడు... మన దగ్గర సరైన ప్రణాళిక లేకపోతే భయపడాల్సిన పనిలేదు. పక్కన వాళ్ల విజయాన్ని చూసి కంగారు పడి వాళ్ల దారిలో వెళ్లడం కంటే, మన మనస్సాక్షి ఏది చెప్తుందో వినడం చాలా ముఖ్యం. మన ప్రత్యేకత ఏంటో తెలుసుకుని ముందుకు వెళ్తే విజయం సాధించవచ్చు అనడానికి రష్మిక సినీ ప్రయాణమే ఒక పెద్ద ఉదాహరణ.
ఈ రోజు పాన్ ఇండియా స్థాయి పాత్రలు చేస్తూ, స్టార్ హీరోల పక్కన నటిస్తూనే, కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలను బ్యాలెన్స్ చేస్తోందంటే దానికి కారణం ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయాలే అని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

Published : 
  • 28 July 2026, 6:10 PM IST