currency

Currency: 2వేల నోటు.. నువ్వెక్కడమ్మా? మన నేతలు దాచిపెట్టేశారా ?

Currency: 2వేల నోటు.. నువ్వెక్కడమ్మా? మన నేతలు దాచిపెట్టేశారా ?

2వేల రూపాయల మీరు చేతులతో తాకి ఎన్ని రోజులు అవుతోంది.. ఆలోచించకండి.. చాలా రోజులు అయ్యే ఉంటుంది. రోజులు కూడా కాదు నెలలు ! ఒక్క మీరే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. 2వేల రూపాయల నోటూ నువ్వెక్కడమ్మా అని అందరూ ఎదురుచూస్తున్న పరిస్థితి. 2016 నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో విడుదలైన రెండు వేల రూపాయల నోట్లు… ఇప్పుడు మార్కెట్‌లో కనిపించడం లేదు. 2016 నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన తర్వాత.. దేశ ఆర్థికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయ్. డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయ్. క్యాష్ వాడకం ఆల్‌టైమ్ హై రికార్డుస్థాయికి చేరింది. ఆరేళ్ల కింద నగదు లావాదేవీల్లో కీలకంగా మారిన పింక్ నోట్ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.