Top story:భారత్‌ బంగారు కొండ..! మన కరెన్సీలో 387 లక్షల కోట్లుగా అంచనా..!

భారత్‌లో బంగారం ఎమోషన్.. నీ ఇల్లు బంగారం కాను.. ప్రతిదానికీ బంగారం లాంటి మనిషి, బంగారు కొండ.. ఇలా రకరకాల విశేషణాలు అల్లుకుని కనిపిస్తాయి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2026 | 06:15 PMLast Updated on: Jan 27, 2026 | 9:41 AM

India Is A Mountain Of Gold Estimated At 387 Lakh Crore In Our Currency

భారత్‌లో బంగారం ఎమోషన్.. నీ ఇల్లు బంగారం కాను.. ప్రతిదానికీ బంగారం లాంటి మనిషి, బంగారు కొండ.. ఇలా రకరకాల విశేషణాలు అల్లుకుని కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో.. ఇక్కడ బంగారానికి దేవతా ఆచ్ఛాదన కూడా ఉండటంతో.. గోల్డ్ మీన్స్ గాడ్ కింద లెక్క. బంగారు నిల్వ చేయడం సంప్రదాయం. గోల్డెన్ సెంటిమెంట్ లేని కుటుంబం ఇండియాలో ఉండదేమో. ధగధగలాడే బంగారు ఆభరణాలతో తళతళ మెరిసిపోవాలనుకుంటారు. అంతే కాదు ఎవరికి ఎంత బంగారముంటే వారికి అంతటి సోషల్ స్టేటస్ అని ఫీల్ అవుతుంటారు మరీ ముఖ్యంగా ఏదైనా పెళ్లి పేరంటాలపుడు మహిళలు బంగారు ఆభరణాలను ధరించడం ద్వారా స్టేటస్‌సు ప్రదర్శిస్తుంటారు.

ఒంటిమీద ఎంత బంగారం ఉంటే అంత డాబు, దర్పం, స్టేటస్. తమకంటూ ప్రత్యేకంగా గౌరవం ఏదైనా లభించాలంటే అది బంగారం వల్లనే అని మన ఆడవాళ్ల నమ్మకం. బంగారం ఒక శుభప్రదంగా భావిస్తారు. ఇక్కడ ఏదైనా సరే బంగారంతో ఉంటే దాన్నొక దైవంగా భావిస్తుంటారు. ఆ మాటకొస్తే మన ఇళ్లు వాకిళ్లూ ఇంకా దేవాలయాలు ఇలా అన్నింటా బంగారం ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. బంగారు వాకిలి, బంగారు కిరీటాలు, గోపురాలు, రథాలు..అంటూ మన ఆలయ వ్యవస్థలో బంగారం అతి పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే ఆయా దేవీ దేవతలు సైతం.. ఎంత ప్రముఖమైన వారో తెలియ చేసేది ఈ బంగారమే.

మనదేశంలో మహిళల దగ్గర బంగారం ఎంతో వుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలో 50 దేశాల దగ్గరున్న బంగారం కంటే మన దేశంలో ఆడవాళ్ల దగ్గరున్న బంగారం ఎక్కువ.వరల్డ్‌లో ఏ మహిళ దగ్గర లేనంత బంగారం మన మహిళల దగ్గరుంది. 3.8 ట్రిలియన్ డాలర్ల బంగారం మనోళ్ల దగ్గరే ఉంది.ఇది చాలా దేశాల వార్షిక బడ్జెట్లు, జాతీయ ఆదాయం, ఎకానమీ కంటే ఎక్కువ. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం.. భారత్‌లో ప్రజల దగ్గర మొత్తం 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ ప్రస్తుతం 3.8 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. అంటే భారత కరెన్సీలో చూసుకుంటే మహిళల వద్ద ఉన్న బంగారం విలువ రూ.337 లక్షల కోట్లు. ఇది భారత దేశ జీడీపీలో ఏకంగా 89 శాతంగా ఉంటుందని నివేదిక చెప్పింది. ప్రజల ఇంటి బ్యాలెన్స్ షీట్‌లో ఇది సానుకూల అంశంగా తెలిపింది. బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడం ప్రజల సంపదను మరింత పెంచుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ బంగారం డిమాండ్‌లో భారత్ 26 శాతంతో ఉంది. చైనా 28 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ప్రజలు ఆర్థిక పరమైన ఆస్తుల్లో ఇటీవలి కాలంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ల ద్వారా బంగారంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది.

రాబోయే భవిష్యత్తు కాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చని, బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారని చెబుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు వినియోగదారులలో ఒకటి. టాప్ 20 గోల్డెన్ కంట్రీస్‌లో మన దేశం 9వ స్థానంలో ఉంటుంది. కానీ మన దగ్గర బంగారానికి ఉన్న విలువ దాన్ని ఆభరణాల ద్వారా ధరించే మోజు ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇక్కడ కేవలం మహిళలే కాదు పురుషులు సైతం గోల్డ్ మేన్స్ గా చెలామణీ అవుతుంటారు.స్థాయిని బట్టి ఎంతో కొంత గోల్డ్ మెడలో వేసుకుంటుంటారు. ఇళ్లు,భూములు ఎలాగో బంగారం సైతం అలాంటి ఆస్తిగా పరిగణించే దేశం కేవలం భారత్ మాత్రమే. అంతగా ఇక్కడ బంగారం కీ రోల్ పోషిస్తుంటుంది.