Cyber Crimes : రూ.98 లక్షలు.. 11 బ్యాంక్ అకౌంట్లు.. హైదరాబాద్‌లో భారీ సైబర్ ఫ్రాడ్..
దేశంలో సైబర్ నేరాలు (Cyber Crimes) రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు.. అసలుకే ఎసరు పెట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింకులు (Fake Links) పంపి అకౌంట్లు హ్యాక్ (Bank Accounts) చేసేవాళ్లు కొందరైతే.. అబద్ధాలు చెప్పి డబ్బు గుంజేవాళ్లు ఇంకొందరు. ప్రాసెస్ ఏదైనా చేసే పని మాత్రం డబ్బు దోచుకోవడం. ఒకప్పుడు దోపిడీ అంటే దారి దోపిడీలు, ఇంటి దోపిడీలు ఉండేవి. కానీ ఇప్పుడు దోపిడీలు కూడా డిజిటలైజ్ ఐపోయాయి.