Bigg Boss : రతికకు షాకిచ్చిన రైతుబిడ్డ, శివాజీ.. బతిమలాడినా తప్పని ఎలిమినేషన్
బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చేసింది.. ట్విస్టుల మీద ట్విస్టులతో హీట్ పెంచేస్తోంది.. ఇక ఈవారం ఆదివారం ఎపిసోడ్ సైతం పూర్తైంది. ఈసారి మాత్రం ఫస్ట్ టైమ్ డబుల్ ఎలిమినేషన్ జరిగింది.. ఆదివారం నాగార్జున ఫన్నీగా షో స్టార్ట్ చేశారు. పలు రకాల గేమ్ ఆడించారు.. ఒక పక్క ఎలిమినేషన్ ప్రక్రియ నడుస్తూ వచ్చింది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు.