Harirama Jogaiah, Pawan Kalyan : పవన్ కి తలనొప్పిగా మారిన జోగయ్య..
హరి రామజోగయ్య(Harirama Jogaiah)… మాజీ మంత్రి… కాపు సామాజిక వర్గం పెద్దాయనగా పిలుచుకునే నాయకుడు. కాపుల కోసం ఓ వైపు ముద్రగడ పద్మనాభం తనదైన స్టైల్లో ఉద్యమాలు చేపడితే.. హరి రామజోగయ్య మరో స్టైల్లో రాజకీయ వ్యవహారాలు నడిపిస్తుంటారు. పొలిటికల్ కామెంట్స్ చేస్తూ.. తనకున్న ఇమేజీతో కాస్తో కూస్తో ప్రభావితం చూసే ప్రయత్నం చేస్తారాయన. ఈ క్రమంలోనే జనసేనకు, ఆ పార్టీ అధినాయకత్వానికి తన వైపు నుంచి.. అప్పడప్పుడు అడక్కుండానే.. సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. జనసేన అలా చేయాలి.. ఇలా చేయాలి..