BRS, MIM : బీఆర్ఎస్ తో ఎంఐఎం దోస్త్ కటీఫ్..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మజ్లిస్ పార్టీ తన రూట్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళుగా BRS తో దోస్తీ కట్టిన MIM.. ఇప్పుడు ఆ పార్టీకి కటీఫ్ చెప్పి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్టు అర్థమవుతోంది. ప్రొటెం స్పీకర్ గా MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ని ప్రభుత్వం ఎంపిక చేయగా.. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం చూస్తే.. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య మళ్ళీ స్నేహం చిగురిస్తుందని తెలుస్తోంది.