విరాట్ కోహ్లి కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న వేళ, భారత క్రికెట్లో తదుపరి స్టార్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. రేసులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ, భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాత్రం మరో ఆటగాడిని నెక్స్ట్ విరాట్ కోహ్లిగా అభివర్ణించాడు. తాజాగా దూరదర్శన్ నిర్వహించిన 'ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో'లో మాట్లాడిన జాఫర్.. కేఎల్ రాహుల్‌ను భవిష్యత్ విరాట్ కోహ్లిగా పేర్కొన్నాడు. ప్రతిభ, టెక్నిక్ పరంగా రాహుల్ విరాట్‌తో సమానమని అన్నాడు. అయితే ఇద్దరి మధ్య తేడాను నిర్ణయించేది విరాట్ మానసిక దృఢత్వమని చెప్పాడు.కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడునీ, మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా రాణించగలడన్నాడు.
టెక్నిక్, ప్రతిభ పరంగా చూస్తే అతడు విరాట్ కోహ్లితో అతను సమానమేననీ ప్రశంసించాడు. అయికే విరాట్‌ని ప్రత్యేకంగా నిలబెట్టింది అతని అసాధారణమైన మెంటాలిటీ అని జాఫర్ వ్యాఖ్యానించాడు.కానీ గణాంకాల పరంగా విరాట్, రాహుల్ మధ్య భారీ అంతరం ఉంది. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో 28359 పరుగులు, 85 సెంచరీలు, 148 అర్ధసెంచరీలు నమోదు చేయగా.. కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 9830 పరుగులు, 22 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు సాధించాడు.
మరోవైపు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే భారత క్రికెట్లో సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2026లో 16 ఇన్నింగ్స్‌లో 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అతడు, అనంతరం టీ20 అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌లో మరోసారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం అతడికి దొరికింది. దీంతోచాలా మంది వైభవ్ ను కోహ్లీ తర్వాత సూపర్ స్టార్ గా అంచనా వేస్తున్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు సంబంధించి రెడ్ బాల్ క్రికెట్ లో అతన్ని తీర్చిదిద్దితేనే అత్యుత్తమ ప్లేయర్ గా ఎదుగుతాడంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.