YCP Mps Jump : నలుగురు వైసీపీ ఎంపీలు జంప్… లైన్ లో ఇంకా ఎంతమంది ?
ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మార్పులు, చేర్పులతో కొంతమంది, అసలు అధికారంలేని పార్టీలో ఉంటే ఎంత… పోతే ఎంత అని కొందరు ఎంపీలు వైసీపీకి గుడ్ బై కొడుతున్నారు. జగన్ పార్టీలో డమ్మీ ఎంపీలుగా ఉండటం కంటే… వేరే పార్టీ నుంచి స్వతంత్ర్యంగా బతకొచ్చని భావిస్తున్నారు.