Cyclone: బీభత్సం సృష్టిస్తున్న బిపర్ జోయ్ చిత్రాలు.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ..
బిపర్ జోయ్ తుఫాన్ దాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. దాదాపు కొన్ని వందల మీటర్లమేర సముద్రం ముందుకు చొచ్చుకొని వచ్చింది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గుజరాత్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతంలోని పరిస్థితిని ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ఏర్పాటు చేశారు.