భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అయోధ్య రామ మందిర నిర్మాణం. దీని ప్రారంభోత్సవ తేదీని ప్రకటించింది ఆలయ కమిటీ. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని స్పష్టం చేసింది.
దాదాపు వంద ఏళ్లకు పైగా కొనసాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీదు వివాదానికి 2019 నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎండ్ కార్డ్ పడింది.