Top story: ఇప్పుడు త్రిష…. అప్పుడు జయలలిత.. ఆడవాళ్ళ చుట్టూ ఆరవ రాజకీయం.!

తమిళనాడు ఎన్నికలై మూడు నెలలు కూడా అవలేదు. విజయ్ సీఎంగా కూర్చుని ఇప్పుడిప్పుడే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు తెచ్చుకున్న తరుణంలో అరవ రాజకీయం అదుపుతప్పింది. నటి,విజయ్ స్నేహితురాలు త్రిష

Post Published By: dialnews
Updated : 5 August 2026, 1:12 PM IST

తమిళనాడు ఎన్నికలై మూడు నెలలు కూడా అవలేదు. విజయ్ సీఎంగా కూర్చుని ఇప్పుడిప్పుడే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు తెచ్చుకున్న తరుణంలో అరవ రాజకీయం అదుపుతప్పింది. నటి,విజయ్ స్నేహితురాలు త్రిష చుట్టూ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు తిరుగుతున్నాయి. త్రిష ప్రస్తావన లేకుండా ఒక్కరోజు కూడా అక్కడ పాలిటిక్స్ నడవడం లేదు. ముఖ్యంగా సీఎం విజయ్ కున్న ఏకైక బలహీనత త్రిష. విజయ్ త్రిష మధ్య సంబంధం ఉంది అనేది ఓపెన్ సీక్రెట్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విజయ్ తరచూ త్రిషా నీ కలుస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందే ఆయన తన భార్యతో విడాకులు కూడా తీసుకున్నారు.

విజయ్ ,త్రిష రిలేషన్ ప్రభావం ఎన్నికల్లో ఏం మాత్రం కనిపించలేదు. కానీ ఎన్నికలు అయిన తర్వాత కూడా త్రిష నీ అడ్డంపెట్టి విజయని ఇరుక్కుని పెట్టే రాజకీయం మాత్రంరంజుగా నడుస్తోంది. తాజాగా కావేరి నది జలాల వివాదంపై తమిళనాడు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయ నిధి పరోక్షంగా త్రిషాని టార్గెట్ చేస్తూ వెకిలి కామెంట్లు చేశారు. కావేరి జలాల అంశంపై డీఎంకే సమావేశంలో ఉదయ నిధి మాట్లాడుతుండగా పలువురు త్రిష ...త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన నవ్వుతూ కావేరి సమస్యపై సీఎం నోరు విప్పట్లేదు. నీరు ఎక్కడికి చేరకపోయినా అక్కడికి మాత్రం చేరాలి. నేను అన్నది కావేరి నీళ్ల గురించి మాత్రమే అని పరోక్షంగా త్రిషపై వ్యాఖ్యానించారు.

డీఎంకే సభలో నటి త్రిషపై ఉదయినిది స్టాలిన్ డబల్ మీనింగ్ డైలాగ్ వాడారంటూ టి వి కే మండిపడింది. ఆయనపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఉదయనిధిని తంజావూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని గంటల పాటు తమిళనాడులో టెన్షన్ వాతావరణ ఏర్పడింది. చివరికి మద్రాస్ హై కోర్టు ఉదయకు బెయిల్ మంజూరు చేసింది. తనపై తప్పుడు కామెంట్లు చేసే వారిని ఉపేక్షించేది లేదని ఉదయనిది అరెస్టుతో వార్నింగ్ ఇచ్చారు సీఎం విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడానికి వీలున్నప్పుడల్లా హీరోయిన్ త్రిషను వివాదాల్లోకి లాగుతున్నారు కొందరు నాయకులు. వీళ్ళ నీ చూస్తూ ఊరుకోకూడదని సీఎం విజయ్ డిసైడ్ అయ్యారు. అందుకే యాక్షన్ స్టార్ట్ చేశారు. కొందరు డీఎంకే నేతలు ఇప్పటికే ఈ విషయంలో అరెస్టు అయ్యారు కూడా.

ప్రతీకార రాజకీయాలు..... వాటి మధ్య మహిళలను టార్గెట్ చేస్తూ వెకిలి మాటలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఏమీ కాదు. జయలలిత అన్నాడీఎంకే జనరల్ సెక్రెటరీగా ఉన్నప్పుడు కూడా ఆమెకు, అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ కు సంబంధం అంటగడుతూ డీఎంకే వాళ్లు రకరకాల ప్రచారాలు చేసేవారు. కరుణానిధి ముగ్గురు భార్యల వ్యవహారం ప్రస్తావనకు వచ్చినప్పుడు... ఆయన ఏకంగా జయలలితను నువ్వు పెద్ద ప్రతివతవి మరి.... అని వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలన సృష్టించింది. 1996లో కరుణానిధి సీఎంగా ఉండగా అవినీతి కేసులో జయలలిత అరెస్టు అయ్యారు.

జయలలిత అధికారంలోకి రాగానే చెన్నై ఫ్లైఓవర్ కరప్షన్ కేసులో 78 ఏళ్ల కరుణానిధి అర్ధరాత్రి అరెస్టు అయ్యారు. అలాగే 2011లో కరుణానిధి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నీ కూడా జయ అరెస్ట్ చేయించారు. ఎంత వద్దనుకున్నా తమిళనాడులో ఆడవాళ్ళ చుట్టూ వివాదాలు.... ప్రతీకార రాజకీయాలు తప్పడం లేదు. ఇప్పుడు సీఎం విజయ్ కూడా డీఎంకే నేతల నోటికి తాళం వేయడానికి అరెస్టుని ప్రయోగించారు.త్రిష పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతున్న వేళ డీఎంకే నేతలు ఏదో మార్గంలో లాగుతూనే ఉన్నారు. అప్పుడు జయలలిత చుట్టూ తమిళ్ రాజకీయాలు తిరిగితే.... ఇప్పుడు త్రిష చుట్టూ అవి మళ్లీ తిరుగుతున్నాయి.

 

Published : 
  • 5 August 2026, 1:12 PM IST