T20 India Pakistan : న్యూయార్క్ లో హై ఓల్టేజ్ ఫైట్.. భారత్, పాక్ క్రికెట్ యుద్ధానికి అంతా రెడీ
ప్రపంచ క్రికెట్ (World Cricket) లో భారత్, పాకిస్తాన్ (India Pakistan) క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు అంతకుమించి… చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాన్స్ సైతం ఆసక్తి గా ఎదురు చూస్తారు. ఆ అద్భుతమైన క్షణం వచ్చేసింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఇవాళే జరగబోతోంది.