Sengol: రాజదండంపై రాజకీయం.. బీజేపీది కట్టుకథ అంటున్న కాంగ్రెస్.. తిప్పికొట్టిన బీజేపీ
రాజదండం (సెంగోల్)పై వివాదం ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.