‘Guntur Karam’ special show : అనాథ పిల్లల కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ షో
సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) కుమార్తె సితార (Sitara) ఘట్టమనేని తన మంచి మనసుని చాటుకుంది. చీర్స్ ఫౌండేషన్‌లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Karam) ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఏఎంబీ సినిమాస్‌లో ఈ కార్యక్రమం జరిగింది.