అన్నపూర్ణకు తొలి అడుగే ఓ చేదు అనుభవం.. డిస్ట్రిబ్యూషన్‌లో ఫంకీ చేసిన గాయం..!

అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో చేతులు కలిపి.. నైజాం డిస్ట్రిబ్యూషన్‌లో

Post Published By: dialnews
Updated : 16 February 2026, 9:55 AM IST

అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో చేతులు కలిపి.. నైజాం డిస్ట్రిబ్యూషన్‌లో తమదైన ముద్ర వేయాలని అన్నపూర్ణ స్టూడియోస్ భావించింది. ఈ క్రమంలోనే సితార నిర్మించిన ఫంకీ సినిమాను ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ వెంచర్‌కు ఆరంభమే అదిరిపోయే షాక్ తగిలింది. రెండు పెద్ద బ్యానర్లు కలిసినా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫంకీ సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ మధ్య ఒక కొత్త బంధం మొదలైంది. కానీ ఈ దోస్తీకి మొదటి సినిమానే చేదు అనుభవాన్ని మిగిల్చింది.

సినిమా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం, ఓపెనింగ్స్ కూడా నామమాత్రంగా ఉండటంతో సినిమా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. భారీ అంచనాలతో, మంచి బ్యాకింగ్‌తో వచ్చినప్పటికీ.. సరైన కంటెంట్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఎంత పెద్ద పేరున్నా నిలదొక్కుకోవడం కష్టమని ఈ ఫలితం మరోసారి నిరూపించింది. మొదటి అడుగులోనే ఇలాంటి పరాజయం ఎదురవ్వడం అన్నపూర్ణ స్టూడియోస్‌కు మింగుడుపడని విషయమే.
ప్రస్తుతం నైజాం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చెలాయించిన ఆధిపత్యం ఇప్పుడు మారుతోంది. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో పాత పద్ధతులు ఇకపై పనిచేయవని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

కేవలం థియేటర్ల సంఖ్యనో, బ్యానర్ ఇమేజో కాకుండా.. కంటెంట్ బలం, యూత్ అప్పీల్ మాత్రమే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయగలుగుతున్నాయి. ఈ మారిన సమీకరణాలను అంచనా వేయడంలో అన్నపూర్ణ టీమ్ కాస్త వెనుకబడిందేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికి పూర్తి విరుద్ధంగా, ఇదే సమయంలో రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా బాగానే వెళ్తుంది. ధీరజ్ మొగిలినేని డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ చిత్రం యూత్‌కు కనెక్ట్ అయ్యింది. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడకుండా.. యూత్ కోరుకునే ఎలిమెంట్స్ ఉండటంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఫంకీ విషయంలో జరిగిన తప్పిదాలను.. కపుల్ ఫ్రెండ్లీ విజయం ఎత్తి చూపిస్తోంది. ఆడియన్స్ మూడ్ స్వింగ్‌ను పసిగట్టడంలో ధీరజ్ మొగిలినేని సక్సెస్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రం రాంగ్ ఛాయిస్‌తో దెబ్బ తిన్నట్లయ్యింది.

మొత్తానికి ఫంకీ ఫలితం అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సితారతో మొదలైన ఈ ప్రయాణం ఇలాంటి రిజల్ట్‌తో స్టార్ట్ అవ్వడం నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో సెలెక్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే, నైజాం లాంటి కీలకమైన మార్కెట్‌లో పోటీని తట్టుకోవడం కష్టం. ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకొని.. అన్నపూర్ణ స్టూడియోస్ తమ తదుపరి సినిమాలతో ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Published : 
  • 16 February 2026, 9:55 AM IST