బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి తలకిందులు అయింది. బండి ఉంటే ఇంకోలా ఉండేది సీన్ అనే పోలికలు మొదలయ్యాయి. ఇలాంటి పరిణామాల మధ్య బండి సంజయ్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం ఫిక్స్ అయింది. బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7 నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు.

Bandi Sanjay is once again preparing for a padayatra From the 7th of this month they are going to hold a padayatra in the Karimnagar assembly constituency