Top story: కొంపముంచిన తాతా మధు…. బి ఆర్ ఎస్ సెల్ఫ్ గోల్.

మ్యాచ్ మంచి రంజుగా జరుగుతుంది. హరీష్ రావు, కేటీఆర్ దూసుకెళ్లిపోతున్నారు. మ్యాచ్ పూర్తిగా బి ఆర్ ఎస్ టీం వైపే ఉంది. అసెంబ్లీ మొదటి రోజు మొత్తం అందరి అటెన్షన్ బీ ఆర్ఎస్ పైకి వచ్చేసింది. అలాంటి టైం లో ఎక్కడి నుంచి వచ్చాడో... ఎమ్మెల్సీ తాతా మధు.

Post Published By: dialnews
Updated : 9 September 2026, 3:10 PM IST

మ్యాచ్ మంచి రంజుగా జరుగుతుంది. హరీష్ రావు, కేటీఆర్ దూసుకెళ్లిపోతున్నారు. మ్యాచ్ పూర్తిగా బి ఆర్ ఎస్ టీం వైపే ఉంది. అసెంబ్లీ మొదటి రోజు మొత్తం అందరి అటెన్షన్ బీ ఆర్ఎస్ పైకి వచ్చేసింది. అలాంటి టైం లో ఎక్కడి నుంచి వచ్చాడో... ఎమ్మెల్సీ తాతా మధు. ఎవ్వరు ఊహించని విధంగా సెల్ఫ్ గోల్ కొట్టాడు. ఆ ఒక్క కిక్ కి మ్యాచ్ మొత్తం కాంగ్రెస్ వైపు తిరిగిపోయింది. బి ఆర్ఎస్ లీడర్లంతా బిత్తర పోయి నెత్తి కొట్టుకున్నారు. మ్యాచ్నీ కాంగ్రెస్ పూర్తిగా కబ్జా పెట్టేసింది. నిన్న తెలంగాణ అసెంబ్లీ బయట, లోపల జరిగిన మ్యాచ్ ఇది.

మీకు ఇప్పటికే ఈ మ్యాచ్ ఏంటో అర్థం అయి ఉంటది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు బి ఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది. స్లోగన్స్ రాసిన టీషర్ట్లు వేసుకుని కేటీఆర్ హరీష్ రావు సారధ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభలోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు.నా...నా రభస జరిగింది. హరీష్ రావు ఏకంగా చొక్కా విప్పి... ఎపిసోడ్లో మాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. నిజానికి ఎప్పుడు సాదాసీదాగా.... లో ప్రొఫైల్లో ఉండే తాత మధుఆటలో తాను ఎక్కడ వెనకబడి పోతానని... కంగారుపడి పోలీసులతో తో వాగ్యుద్ధానికి దిగారు. ఆ సమయంలో మాట మాట పెరిగింది. తాత మధు నోట్లోంచి రాకూడని పదాలు వచ్చేసేయ్.

అప్పటివరకు మూడు గంటల నుంచి బి ఆర్ఎస్ దూకుడుగా నడిపిస్తున్న షో ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. ఉదయం నుంచి డిఫెన్స్ లో పడిన కాంగ్రెస్... ఏం చేయాలో పాలు పోను పరిస్థితుల్లో ఉంది. అదే సమయంలో తాత మధు తిట్టిన తిట్టు అందిపుచ్చుకున్నారు కాంగ్రెస్ వాళ్లు. స్పీకర్ ఎస్సీ కావడం... స్పీకర్ ని నేరుగా తాత మధు కామెంట్స్ చేయడం తో ఈ వివాదం ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. మధు మాటల్ని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ ఎదురుదాడి చేసి ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో పై చేయి సాధించింది.జరిగిన డ్యామేజ్ ని ఆలస్యంగా గుర్తించిన టిఆర్ఎస్.... వ్యవహారాన్ని తిరిగి తన అదుపులోకి తెచ్చుకోవడానికి సాయి శక్తుల ప్రయత్నించింది. బీ ఆర్ఎస్ నేత మాజీ మంత్రి సబితా ను పోలీసులు కొట్టారని, సీనియర్ నేత సునీత లక్ష్మారెడ్డి చీర లాగారని ఆరోపిస్తూ బీ ఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. కానీ ఫలితం లేకపోయింది.

రెండో రోజు కూడా తెలంగాణ అసెంబ్లీ అట్టుడికి పోయింది. స్పీకర్ పై దారుణంగా మాట్లాడిన తాత మధు, ఎమ్మెల్సీ హరీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దర్నీ బర్తరఫ్ చేయాలని కూడా అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ డ్యామేజ్ ను తప్పించుకోవడానికి హరీష్ కేటీఆర్ లు మిగిలిన నేత లను వెంటబెట్టుకుని, కెసిఆర్ ఫాం హౌస్ వైపు వెళ్తూ మనోసారి అరెస్టు అయ్యారు. ఏది ఏం చేసినా తాతా మధు మాట్లాడిన ఒక్క మాట.... టిఆర్ఎస్ సంపాదించుకున్న మైలేజ్ ను మొత్తం పోగొట్టింది. హరీష్ రావు తో పాటు మిగిలిన నేతలు షర్ట్స్ విప్పిన.... కేటీఆర్ లాంటి నాయకులు పోలీసులు పైకి దూసుకెళ్లిన... తాతా మధు చేసిన వ్యాఖ్యలతో క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ ఎత్తుకెళ్లిపోయింది.

 

 

Published : 
  • 9 September 2026, 3:10 PM IST