మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి.. ఆ వెంటనే మేనిఫెస్టో అనౌన్స్ చేసేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను తలదన్నెలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని.. జనాల దృష్టి తమవైపు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.
