Swathi Deekshith: కబ్జా స్టార్‌.. రూ.30 కోట్ల ఇల్లు కబ్జా.. స్టార్‌ హీరోయిన్‌ అరెస్ట్‌..

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్‌ జూబ్లీహిల్స్‌లో ఓ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. కొన్ని రోజుల నుంచి ఈ ఇంటి లీజ్‌ విషయంలో స్వాతికి, ఇంటి ఓనర్‌కు మధ్య వివాదం నడుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 21 November 2023, 5:57 PM IST

Swathi Deekshith: హైదరాబాద్‌లో కబ్జాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. డేగల్లా వాలి బోర్డులు పెట్టేస్తున్నారు కొందరు కబ్జాదారులు. అయితే ఈ దందా.. దాదాపుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉండేవాళ్లు, రౌడీ షీటర్లు చేస్తుంటారు. కానీ.. ఓ స్టార్‌ హీరోయిన్‌ ఒక ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అవును.. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్‌ జూబ్లీహిల్స్‌లో ఓ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఇంటి విలువ దాదాపు రూ.30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

MEGASTAR CHIRANJEEVI: నేనున్నా.. నోరు జాగ్రత్త.. త్రిషకు చిరంజీవి సపోర్ట్‌..

కొన్ని రోజుల నుంచి ఈ ఇంటి లీజ్‌ విషయంలో స్వాతికి, ఇంటి ఓనర్‌కు మధ్య వివాదం నడుస్తోంది. ఇంటి ఓనర్‌ ఎన్‌ఆర్‌ఐ. ఇక్కడ ఇంటిని వాచ్‌‌మెన్‌ పర్యవేక్షిస్తున్నాడు. ఆ ఇంటిని సొంతం చేసుకోవాలి అనుకున్న స్వాతి దీక్షిత్‌ నేరుగా అదే ఇంటికి వెళ్లినట్టు సమాచారం. అనుమతి లేకుండా ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నించడంతో.. వాచ్‌మెన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాలా కాలం నుంచి ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కంప్లైట్‌ ఇచ్చాడు. దీంతో స్వాతితో పాటు ఆమెకు సహకరించిన 20 మందిపై పోలీసులు కేసు నమోదు. ఈ ప్రాపర్టీకి సంబంధించి గతంలో కూడా చాలా వివాదాలు జరిగినట్టు చెప్తున్నాడు వాచ్‌మెన్‌. ఇదే విషయంలో కోర్టులో కేసు కూడా పెండింగ్‌లో ఉందట.

కోర్టు నుంచి ఎలాంటి తీర్పు రాకుండానే ఇంట్లో ప్రవేశించేందుకు స్వాతి ప్రయత్నించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్తున్నాడు. అసలు ఈ విషయంలో ఏం జరిగింది అనే పూర్తి వివరాలు త్వరలోనే చెప్తామంటున్నారు పోలీసులు.

Published : 
  • 21 November 2023, 5:57 PM IST