వివేకా మర్డర్ కేసులో తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పటి వరకూ ప్రతీ రోజూ సీబీఐ విచారణకు రావాలంటూ అవినాష్‌రెడ్డిని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు స్వీకరించింది. దీనిపై దుతి తీర్పు ఈ నెల 25న ఇస్తామంటూ చెప్పింది. అవినాష్ రెడ్డి విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలంటూ సీబీఐని ఆదేశించింది.

Avinash Reddy CBI Interrogation