Special story: మా వాళ్లను ఒప్పించడం కంటే కేతన్‌ను చం*పడమే ఈజీ..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూనే కేతన్ మర్డర్ కేసులో సియా చెబుతున్న విషయాలు విని పోలీసులే షాక్ అవుతున్నారు. మర్డర్ చేసేందుకు లవర్ తో కలిసి ఆమె వేసిన ప్లాన్స్, దాని కోసం చేసిన రెక్కీ ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.

Post Published By: dialnews
Updated : 30 June 2026, 5:15 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూనే కేతన్ మర్డర్ కేసులో సియా చెబుతున్న విషయాలు విని పోలీసులే షాక్ అవుతున్నారు. మర్డర్ చేసేందుకు లవర్ తో కలిసి ఆమె వేసిన ప్లాన్స్, దాని కోసం చేసిన రెక్కీ ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఇప్పటికే నిందితులతో సీన్ రీ క్రియేట్ చేసిన పోలీసులు మరోసారి వాళ్ళను విచారించారు. ఈ విచారణలో నిందితులు పలు సంచలన విషయాలు పోలీసులతో చెప్పినట్టు తెలుస్తోంది. కేతన్ తో ఇంట్లో వాళ్ళు పెళ్లి నిశ్చయించినప్పటికీ తనకు కేతన్ ను పెళ్లి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పింది సియా. అయితే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించాలి అనుకోవడంలో ఎలాంటి యూస్ లేదని తాను భావించినట్టు చెప్పింది. చిన్నప్పటి నుంచి తన ఇంట్లో వాళ్లను చూస్తోంది కాబట్టి.. వాళ్లని ఒప్పించడం అసాధ్యం అని భావించి కేతన్ నే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నట్టు సియా చెప్పింది.

కేతన్ ను హత్య చేస్తే తను జైలుకు వెళ్తానని తెలిసినప్పటికీ.. తన ఇంట్లో వాళ్లను పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఒప్పించడం కంటే.. మర్డర్ చేసి తప్పించుకోవడమే సులభం అని తను భావించినట్టు వివరించింది. కేతన్ ను ఎలా చంపాలి అనే విషయంలో సియా, చేతన్ ఇద్దరు గూగుల్ సహాయం తీసుకున్నారట. హౌ టు కిల్ ఫియాన్సీ పేరుతో చాలా రోజులు సర్చ్ చేసి.. ఎలా చంపితే పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉంటాయి అని ఒక క్లారిటీకి వచ్చారట. అప్పుడే ఏదైనా లోయలో తోసి చంపేస్తే పోలీసులకు పెద్దగా ఆధారాలు దొరకవు, ప్రమాదవశాత్తు పడిపోయాడని చెప్పి నమ్మించి కేసు నుంచి తప్పించుకోవచ్చు అని నిందితులిద్దరూ ప్లాన్ చేసినట్టు విచారణలో ఒప్పుకున్నారు. అయితే ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి, ఎలా చంపాలి అనే విషయంలో మాత్రం ఇద్దరు చాలాసార్లు చర్చించినట్లు చెప్పారు.

చివరికి డిసెంబర్ లో లోహగడ్ పోర్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న భయంకరమైన లోయను చూసి.. కేతన్ మర్డర్ కు ఇదే పర్ఫెక్ట్ స్పాట్ అని తాను ఫిక్స్ అయినట్టు చెప్పింది సియా. అనుకున్నట్టుగానే జూన్ 14న కేతన్ ను అక్కడికి తీసుకువెళ్లి.. పామును చూసి భయపడినట్టు నాటకమాడి లోయలో తోసే ప్రయత్నం చేసింది. కానీ కేతన్ పక్కనే ఉన్న ఒక పొదును పట్టుకొని ఉండటంతో కింద పడిపోలేదు. దీంతో ఈ మర్డర్ చేసేందుకు ప్రాక్టీస్ అవసరం అని భావించి.. మర్డర్ కోసం సియా రిహార్సల్స్ కూడా చేసింది. తన లవర్ తో కలిసి ఎప్పుడు ఎలా నెట్టాలి, ఎంత వేగంగా నెడితే కింద పడిపోతాడు. ఎవరికి అనుమానం రాకుండా ఎలా చేయాలి అనే విషయాలపై ఇద్దరు కలిసి చాలాసార్లు రిహార్సల్స్ చేసినట్టు చెప్పారు. రిహార్సెల్ మొత్తం పూర్తయి.. హత్య చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని భావించిన తరువాత.. జూన్ 18న కేతన్ లోహగడ్ ఫోర్ట్ కి తీసుకెళ్లి అక్కడ హత్య చేసినట్టు సియా చెప్పింది.

సియా చెబుతున్న నిజాలు విని కేతన్ కుటుంబ సభ్యులు విలవిలలాడిపోతున్నారు. సియా తన ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించే ధైర్యం చేయకపోయినా ఈ పెళ్లి ఇష్టం లేదని తమతో ఒక్క మాట చెప్తే.. తమ వైపు నుంచి తామే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేవాళ్లం అంటూ చెబుతున్నారు. ఒక్కమాట కూడా చెప్పకుండా చెట్టంత తమ కొడుకుని పొట్టన పెట్టుకుందని కన్నీరు మున్నీరవుతున్నారు. 600 కోట్ల ఆస్తి ఉన్నా.. ఆ వ్యక్తిని కాదని.. ప్రేమించిన వ్యక్తి కావాలి అనుకుందంటే సియా ప్రేమను మెచ్చుకోక తప్పదు. కానీ ఒక మనిషిని చంపి హంతకురాలిగా రాలిగా మారిన తన చర్య ఏ మాత్రం సమర్థనీయం కాదు. పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించుకోవాలి. అది కుదరకపోతే పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో మాట్లాడి అర్థమయ్యేలా వివరించాలి. అది కుదరనప్పుడు ప్రేమించిన వ్యక్తితో పారిపోయి ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క పని చేసిన సియా గొప్ప ప్రేమికురాలిగా మిగిలిపోయేది. కానీ ఇవేం చేయకుండా ఓ వ్యక్తి ప్రాణం తీసి హంతకురాలిగా నిలబడింది.

Published : 
  • 30 June 2026, 5:15 PM IST