Top story: ఎవడు ఈ కటౌట్ శ్రీను? జిమ్ ట్రైనర్ మర్డర్ వెనుక ఎంత స్టోరీ ఉందా?

కాకినాడలో ఈనెల 26న సంచలనం సృష్టించిన జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి మర్డర్ మరో మలుపు తిరిగింది.. సతీష్ ను అతని స్నేహితులు సాయి కిరణ్ మరో ముగ్గురు చంపారు.. అయితే చంపింది వాళ్లే అయినప్పటికీ చంపించింది మాత్రం టిడిపి లోకల్ లీడర్ కటౌట్ శ్రీను

Post Published By: dialnews
Updated : 31 August 2026, 3:34 PM IST

కాకినాడలో ఈనెల 26న సంచలనం సృష్టించిన జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి మర్డర్ మరో మలుపు తిరిగింది.. సతీష్ ను అతని స్నేహితులు సాయి కిరణ్ మరో ముగ్గురు చంపారు.. అయితే చంపింది వాళ్లే అయినప్పటికీ చంపించింది మాత్రం టిడిపి లోకల్ లీడర్ కటౌట్ శ్రీను అని మృతుడు సతీష్ భార్య ఆరోపిస్తోంది.. పోలీసులు కూడా ఈ విషయాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 26న తెల్లవారుజామున కాకినాడ భానుగుడి సెంటర్ లో జిమ్ ట్రైనర్ సతీష్ ని కిరాతకంగా కొట్టి ఫ్లెక్సీ కి ఉన్న చెక్క గొంతులో దింపి నలుగురు వ్యక్తులు చంపేశారు నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఈ మర్డర్ జరిగింది.

సాయి కిరణ్ తో పాటు మరో ముగ్గురు ఈ మర్డర్ చేశారు... అయితే టిడిపి నేత కటౌట్ శ్రీను అనే వ్యక్తి తన భర్తను చంపించాడని చెప్తుంది సతీష్ భార్య జయ శ్రీ..... శ్రీనుకి అతని భార్యకి గత కొద్ది కాలంగా విభేదాలు ఉన్నాయని, వాళ్ళిద్దరికీ విడాకులు కూడా మంజూరయ్యాయి అని తెలిపింది.. అయితే వాళ్ళు గొడవలో ఉన్న సమయంలోనే శ్రీను భార్యతో సతీష్ సన్నిహితంగా ఉండేవాడు. ఆమెతో సతీష్ కి వివాహేతర సంబంధం ఉందని వదంతులు నడిచాయి. వారితో విడిపోవడానికి సతీష్ కారణం అని భావించాడు కటౌట్ శ్రీను... సతీష్ కి కూడా ఈ మధ్యనే పెళ్లి అయింది ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి . సతీష్, కటౌట్ శ్రీను మధ్య చాన్నాళ్లుగా స్నేహం ఉంది. సతీష్ ని చంపిన హత్య చేసిన సాయి కిరణ్ కూడా స్నేహితుడే. ఏం జరిగిందో ఏమో గాని సడన్ గా సాయి కిరణ్ మరో ముగ్గురితో కలిసి సతీష్ ను చంపేశాడు.. ఆ సమయంలో సతీష్ ని పిలిచి మరీ గొడవ పెట్టుకుని హత్య చేశాడు.

గతంలోని సతీష్ భార్యకు వాట్సాప్ కాల్ చేసి కటౌట్ శ్రీను బెదిరించాడు.. నీ మొగుడిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.. దాంతో ఏమైంది ఏంటి అని భర్తని ఆరా తీసింది భార్య... అలాగే కటౌట్ శ్రీను భార్యని కూడా ఎంక్వయిరీ చేసింది.. తాను ఇష్టపూర్వకంగానే శ్రీను కి దూరంగా ఉంటున్నానని ఈ విషయంలో సతీష్ కు సంబంధం లేదని చెప్పింది శ్రీను భార్య.. ఈ విషయాలను శ్రీను కి చెప్పింది సతీష్ భార్య... అయినా శ్రీను మాత్రం వినిపించుకోలేదు. జిమ్ ట్రైనర్ సతీష్ సాయి కిరణ్ అనే మరో స్నేహితుడు భార్యతోను సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో కటౌట్ శ్రీను ,సాయి కిరణ్ ఒకటయ్యారు. శ్రీను ఆదేశాలు మేరకు సాయికిరణ్ సతీష్ ని చంపేశాడు.. ఆ ఘటన జరిగే సమయంలో కటౌట్ శ్రీను తెలివిగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు తనకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు... మరోవైపు సతీష్ భార్య తనకున్న అనుమానాలను పోలీసులు దృష్టికి తీసుకుని వెళ్తుంటే స్టేట్మెంట్ లో శ్రీను పేరు తేవొద్దన్నారని బెదిరించారని తాము చెప్పిందే చెప్పమన్నారని ఆరోపణలు చేస్తున్నారు ...

కటౌట్ శ్రీను ప్రస్తుతం టిడిపిలో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నాడని, ఎమ్మెల్యే కొండబాబుకు అనుచరుడుగా ఎగిపోతున్నాడని, రాజకీయంగా సపోర్ట్ ఉండటంతో పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్తుంది. ఈ హత్యకు సంబంధించి రెండు సీసీ కెమెరాలు పుట్టేజులు బయటకు వచ్చాయి... సతీష్ ను ఒక్కడిని చేసి నలుగురు చావబాది చెక్కను బలవంతంగా గొంతులోకి వచ్చేసారు... వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ వెనక్కి వచ్చి మరి తమ కక్ష తీర్చుకున్నారు... ఆ సమయంలో వాళ్లు మద్యం మత్తులో ఉన్నట్లు అర్థమవుతుంది.సతీష్ భార్య చెప్పిన విషయాల మేరకు కటౌట్ శ్రీను ఆదేశాలను సాయి కిరణ్ అమలు చేశాడు హత్య చేసింది సాయి అయినప్పటికీ చేయించిన వారిని మాత్రం బయటికి రాకుండా పోలీసులు చూస్తున్నారని విమర్శలు చేస్తుంది సతీష్ భార్య... తనకు వార్నింగ్ ఇచ్చి మరి తన భర్తను స్నేహితుడితోని మట్టు పెట్టించారు అంటుంది. మొత్తం మీద జిమ్ ట్రైనర్ సతీష్ అత్య వెనక ఉన్నది కూడా అక్రమ సంబంధాల ఆరోపణలే.

 

 

Published : 
  • 31 August 2026, 3:34 PM IST