Top story: పాస్‌పోర్ట్ షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న ఫీజులు స్టూడెంట్స్ అలర్ట్..!

జూలై 1 నుంచి పెరగనున్న ఫీజులువిదేశీ ప్రయాణాలు & స్టూడెంట్స్ బడ్జెట్‌పై ప్రభావం అడల్ట్స్ (36 పేజీలు): నార్మల్ ₹2,500, తత్కాల్ ₹5,000 జంబో పాస్‌పోర్ట్ (60 పేజీలు): నార్మల్ ₹3,500, తత్కాల్ ₹6,000మైనర్స్

Post Published By: dialnews
Updated : 30 June 2026, 2:15 PM IST

జూలై 1 నుంచి పెరగనున్న ఫీజులువిదేశీ ప్రయాణాలు & స్టూడెంట్స్ బడ్జెట్‌పై ప్రభావం అడల్ట్స్ (36 పేజీలు): నార్మల్ ₹2,500, తత్కాల్ ₹5,000 జంబో పాస్‌పోర్ట్ (60 పేజీలు): నార్మల్ ₹3,500, తత్కాల్ ₹6,000మైనర్స్ (18 ఏళ్ల లోపు): నార్మల్ ₹1,750, తత్కాల్ ₹4,250
పోగొట్టుకున్న లేదా పాడైపోయిన పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్ చార్జీలు కూడా అప్!స్టూడెంట్స్ అలర్ట్.. డెడ్‌లైన్స్ లోపే నార్మల్ ప్రాసెస్‌లో అప్లై చేసుకోండి!పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫీజు ఇకపై ₹750విదేశాలకు వెళ్లి చదువుకోవాలని లేదా ట్రావెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చింది. జూలై 1, 2026 నుంచి పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త పాస్‌పోర్ట్ అయినా, రెన్యూవల్ అయినా, లేదా అర్జెంట్‌గా తత్కాల్‌లో అప్లై చేసినా.. జేబు ఖాళీ అవ్వడం ఖాయం. అసలు ఫీజులు ఎంత పెరిగాయి..?

కొత్త రూల్స్ ప్రకారం ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి:18 ఏళ్లు పైబడిన వారికి.. 36 పేజీల పాస్‌పోర్ట్: నార్మల్ స్కీమ్ కింద ₹2,500, తత్కాల్ కింద ₹5,000 కట్టాలి.60 పేజీల జంబో పాస్‌పోర్ట్: నార్మల్ అప్లికేషన్‌కు ₹3,500, తత్కాల్‌కు ₹6,000 చెల్లించాలి.మైనర్లకు అంటే.. 18 ఏళ్ల లోపు వారికి: 36 పేజీల పాస్‌పోర్ట్‌కు నార్మల్ కింద ₹1,750, తత్కాల్ కింద ₹4,250 ఫిక్స్ చేశారు.పోగొట్టుకున్న లేదా పాడైపోయిన పాస్‌పోర్ట్ స్థానంలో కొత్తది తీసుకోవాలన్నా కూడా చార్జీలు పెరిగాయి.ముఖ్యంగా విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఈ ఫీజుల పెంపు ఒక అదనపు భారం కానుంది. యూనివర్సిటీ అడ్మిషన్స్, స్టూడెంట్ వీసాల కోసం పాస్‌పోర్ట్ మొదటి మెట్టు.

అంతేకాదు, వీసా ప్రాసెస్ కోసం తప్పనిసరిగా కావాల్సిన పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫీజును కూడా ₹750 కి పెంచారు. కాబట్టి డెడ్‌లైన్స్ ఉన్నవాళ్లు తత్కాల్ ఖర్చులు తట్టుకోలేరు కాబట్టి, నార్మల్ ప్రాసెస్‌లోనే వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం మంచిది.అయితే ఒక చిన్న ఊరట ఏంటంటే.. 8 ఏళ్ల లోపు పిల్లలకు, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కొత్త అప్లికేషన్లపై 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. కానీ ఇది కేవలం ఫ్రెష్ పాస్‌పోర్ట్‌లకు మాత్రమే వర్తిస్తుంది, రీ-ఇష్యూకు వర్తించదు. గుర్తుపెట్టుకోండి, పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే, అది పౌరసత్వ నిరూపణ పత్రం కాదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి జూలై 1 రాకముందే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి.

Published : 
  • 30 June 2026, 2:15 PM IST