Sajjala Ramakrishna Reddy: ఏపీలో జైలుకెళ్తున్న తొలి మాజీ సీఎం చంద్రబాబు: సజ్జల

చంద్రబాబు లోకేష్ వ్యవహారాన్ని ప్రజలంతా చూశారు. శనివారం నుంచి టీడీపీ..శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ రూపకర్త, దర్శకత్వం అంతా చంద్రబాబే.

Post Published By: narender Thiru
Updated : 10 September 2023, 7:59 PM IST

Sajjala Ramakrishna Reddy: అవినీతి ఆరోపణలతో తెలుగు రాష్ట్రాల్లో జైలుకు వెళ్లబోతున్న తొలి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్యానించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై సజ్జల మీడియాతో మాట్లాడారు.

‘‘చంద్రబాబు లోకేష్ వ్యవహారాన్ని ప్రజలంతా చూశారు. శనివారం నుంచి టీడీపీ..శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ రూపకర్త, దర్శకత్వం అంతా చంద్రబాబే. స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి. ఏడాదిన్నర నుంచి కేసు దర్యాప్తు జరుగుతోంది. అన్ని ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసింది. చంద్రబాబును అదుపులోకి తీసుకున్నప్పటినుంచి నారా, నందమూరి కుటుంబాలు లెక్కలేనంతగా వ్యవహరించాయి. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ కుంభకోణం జరిగింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట.

అరెస్ట్ చేస్తే ఒక డ్రామా.. చేయకపోతే మరో డ్రామా ఆడతారు. రాత్రి పవన్ కళ్యాన్ ఓవర్ యాక్షన్ చేశారు. చంద్రబాబుకు కచ్చితంగా శిక్ష పడుతుంది. చంద్రబాబుపై ఇంకా కేసులు వస్తయి. అవినీతి కేసులలో చంద్రబాబు దొరకడం ఖాయం. తనపై దాఖలైన కేసుల్ని చంద్రబాబు చట్ట ప్రకారం ఎదుర్కోవాలి. చంద్రబాబు అరెస్ట్.. ప్రపంచంలో జరగరాని ఘోరం అన్నట్లు టీడీపీ శ్రేణులు వ్యవహరించాయి. చేసిన నేరాలకు తలదించుకోవాల్సిందిపోయి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తప్పు చేయకుంటే రూ.కోటి ఇచ్చి లాయర్‌ను ఎందుకు తెచ్చుకున్నారు. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం చిన్నది. ఇంకా చాలా కేసులు వున్నాయి’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

 

Published : 
  • 10 September 2023, 7:59 PM IST