Navdeep: డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌కు నోటీసులు..!

తాను డ్రగ్స్‌ కేసులో ఇన్వాల్స్‌ కాలేదని.. పోలీసులు చెప్తున్న నవదీప్‌ నేను కాదంటూ చెప్పారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ చెప్పాడు నవదీప్‌. అయితే ఈ కేసులో ఇప్పుడు మరోసారి నవదీప్‌ పేరు రావడం కలకలం సృష్టిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 15 September 2023, 1:09 PM IST

Navdeep: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. లోతుగా విచారణ చేస్తున్న కొద్దీ ప్రముఖ పేర్లు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే హీరో నవదీప్‌ నిందితుడిగా ఉన్నాడని.. విషయం బయటికి రావడంతో నవదీప్‌ పరారీలో ఉన్నాడంటూ సీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. ఈ విషయంపై నవదీప్‌ కూడా స్పందించారు. తాను డ్రగ్స్‌ కేసులో ఇన్వాల్స్‌ కాలేదని.. పోలీసులు చెప్తున్న నవదీప్‌ నేను కాదంటూ చెప్పారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ చెప్పాడు నవదీప్‌.

అయితే ఈ కేసులో ఇప్పుడు మరోసారి నవదీప్‌ పేరు రావడం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో నవదీప్‌ ఉన్నాడంటూ పోలీసులు మరోసారి చెప్పారు. నవదీప్‌కు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. దీంతోపాటే పలు పబ్‌లపైనా నార్కోటిక్ పోలీసులు నిఘా పెట్టారు. గచ్చిబౌలిలోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రోలో డ్రగ్స్ విక్రయాలు జరిగాయని తెలుస్తోంది. ఈ కేసులో డీలర్‌ బాలాజీ నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారూ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

హీరో నవదీప్, షాడో, రైడ్‌ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్‌ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్‌ కుమారుడు సురేశ్‌ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్‌తోపాటు కలహర్‌రెడ్డి ఉన్నారంటూ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కొందరు నిందితులను రింమాండ్‌కు తరలించారు. ఈ నోటీసులపై నవదీప్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Published : 
  • 15 September 2023, 1:09 PM IST