BIGG BOSS 7: కెప్టెన్సీ పోరు.. వీరసింహాలు వర్సెస్ గర్జించే పులులు..

నామినేషన్ల పర్వం నుంచి.. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వరకు సో సోగా సాగుతోంది. చాడీలు చెప్పుకోవడం తప్ప.. పెద్దగా కంటెంట్ లేదని బుల్లితెర ఆడియెన్స్ ఫిక్స్ అవుతున్నారు. చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. చెప్పాలంటే ఈవారం ఎపిసోడ్ చప్పగా మొదలైందనిపిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 3 November 2023, 6:48 PM IST

BIGG BOSS 7: బిగ్‌బాస్ సీజన్ 7 (BIGG BOSS 7) తెలుగులో తొమ్మిదోవారం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా మారుతోంది. గత వారాలతో పోల్చుకుంటే.. ఈవారం కాస్త డల్ అయిందన్న టాక్ నడుస్తోంది. నామినేషన్ల పర్వం నుంచి.. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వరకు సో సోగా సాగుతోంది. చాడీలు చెప్పుకోవడం తప్ప.. పెద్దగా కంటెంట్ లేదని బుల్లితెర ఆడియెన్స్ ఫిక్స్ అవుతున్నారు. చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. అలా అన్నారు.. ఇలా అన్నారు.. అంటూ పక్కవాళ్ల బుర్రను తినేస్తున్నారు. చెప్పాలంటే ఈవారం ఎపిసోడ్ చప్పగా మొదలైందనిపిస్తోంది.

RAM CHARAN: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ అకాడమీ జాబితాలో చోటు..

ఇక హౌస్‌లో టేస్టీ తేజ (TASTY TEJA) తనదైన మార్క్ కామెడీతో సరదాగా ఉంటూ ఆకట్టుకుంటున్నాడు. తేజ, శోభా శెట్టి (SHOBHA SHETTY) మధ్య ఫుల్ ఫన్ క్రియేట్ అవుతోంది. పర్సనల్ విషయాలతో పాటు బిగ్ బాస్‌లో తన ప్రవర్తన, గేమ్ వంటి విషయాలను తేజతో షేర్ చేసుకుంటోంది శోభా. హౌస్‌లో నిద్ర పోయిన తేజకు గౌతమ్ చీర కట్టుకోవాలని పనిష్‌మెంట్‌ ఇచ్చాడు. దీంతో శోభా శెట్టి.. తేజకి చీరకట్టి రెడీ చేసింది. కాసేపు అమ్మాయిలా ప్రవర్తించి నవ్వులు పూయించాడు తేజ. ఇక శివాజీ (SHIVAJI), అమర్‌.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కనిపించారు. కట్ చేస్తే.. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంటిసభ్యులను వీరసింహాలుగా, గర్జించే పులులుగా విభజించాడు బిగ్ బాస్. యావర్‌, గౌతమ్‌, భోలే, తేజ, శోభా శెట్టి, రతిక వీర సింహాలు గ్రూపులో, అమర్‌ దీప్‌, ప్రశాంత్‌, శివాజీ, అర్జున్‌, ప్రియాంక, అశ్విని గర్జించే పులులు టీమ్‌లో ఉంటారు. మొదటి టాస్క్‌లో భాగంగా మొదటగా బాల్స్‌ని పట్టుకునే టాస్క్ ఇచ్చాడు.

Chandrababu Naidu: చంద్రబాబు ఒంటరయ్యారా..? అరెస్టు ద్వారా తేలిందేంటి..?

అందులో భాగంగా బాల్స్‌ని వారికిచ్చిన ప్యాకెట్‌లోనే భద్రపరచాలని బిగ్ బాస్ సూచించడంతో వాటిని దాచుకునేందుకు నానా కష్టాలు పడ్డారు ఇంటిసభ్యులు. ఆ తర్వాత రెండో టాస్క్ కూడా ఇచ్చాడు. బెలూన్స్‌ని టైర్లలో ఫిల్‌ చేయాలని ఆదేశించగా.. వీరసింహాలు టీమ్‌ గెలుపొందింది. గెలిచిన వాళ్లకు బిగ్ బాస్ పవర్ బాక్స్ ఇచ్చాడు. దానిని ఒపెన్ చేసిన వీరసింహాల టీం.. ప్రత్యర్థి టీమ్‌లో ఒకరిని ఆట నుంచి తొలగించాలని చెప్పగా.. ప్రశాంత్‌ను గేమ్ నుంచి తొలగించారు. దీంతో ప్రశాంత్ కన్నీరు పెట్టుకున్నాడు. ఇవాళ జరిగే టాస్క్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Published : 
  • 2 November 2023, 1:41 PM IST