BREAKING NEWS : అంకుర హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం

అంకుర హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ఐదో ఫ్లోర్ లో మొదలైన మంటలు... పదో ఫ్లోర్ కి విస్తరించాయి.

Post Published By: dialnews
Updated : 23 December 2023, 6:47 PM IST

Ankura Hospital Fire Accident: హైదరాబాద్ గుడిమల్కాపూర్ లోని అంకుర హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.  మొదట ఐదో ఫ్లోర్ లో మొదలైన మంటలు పదో ఫ్లోర్ దాకా విస్తరించాయి.  హాస్పిటల్ నేమ్ బోర్డుకు మంటలు అంటుకోవడంతో.... పక్కనే ఉన్న ఫ్లెక్సీల నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పదో ఫ్లోర్ లో భారీగా ప్లాస్టిక్ మెటీరియల్ ఉన్నట్టు తెలుస్తోంది.  అందుకే అక్కడ మంటల తీవ్రత ఎక్కువగా ఉంది.  మంటలు చెలరేగగానే కొందరు పేషెంట్లను అంకుర హాస్పిటల్ సిబ్బంది కిందకు తీసుకొచ్చారు.  ఈ హాస్పిటల్ లో గర్భిణీలు, చిన్నారులు కూడా భారీగా ఉన్నట్టు చెబుతున్నారు. ఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజిన్లు చేరుకొని మంటలను ఆర్పుతుననాయి.  ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ దాకా మంటలు వ్యాపించాయి. ఈ హాస్పిటల్ బిల్డింగ్ నిబంధనలను విరుద్ధంగా కట్టినట్టు తెలుస్తోంది.  ఫైర్ ఇంజిన్లు లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది.

Published : 
  • 23 December 2023, 6:47 PM IST