తాడేపల్లిలో ఉండన్నా ప్లీజ్

ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ పదే పదే బెంగళూరు వెళ్ళడం ఇప్పుడు ఆనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆయన ఎందుకు బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారో అర్ధం కాక వైసీపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 20 August 2024, 10:50 AM IST

ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ పదే పదే బెంగళూరు వెళ్ళడం ఇప్పుడు ఆనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆయన ఎందుకు బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారో అర్ధం కాక వైసీపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పదే పదే బెంగళూరు వెళ్లి అక్కడే ఉండి వస్తున్నారు. ఏదైనా పని ఉంటే మినహా ఆయన తాడేపల్లి రాకపోవడం అందరిని విస్మయానికి గురి చేస్తోంది.

మధ్యాహ్నం నాలుగు గంటలకే బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి రానున్న మాజీ సీఎం జగన్... విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆరోసారి బెంగళూరు వెళ్లి వస్తున్న జగన్ పై సొంత పార్టీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో జగన్ కు పనేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు దీనిపై విమర్శలు చేయడంతో తాడేపల్లిలో ఉండన్నా ప్లీజ్ అంటూ వేడుకొంటున్నారు.

Published : 
  • 20 August 2024, 10:50 AM IST