టీ ట్వంటీల్లో భారత్ దూకుడు.. ఆల్ టైమ్ రికార్డు సొంతం..!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత జట్టు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వేతో శనివారం హరారేలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు రాబట్టింది.

Post Published By: dialnews
Updated : 27 July 2026, 7:09 PM IST

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత జట్టు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వేతో శనివారం హరారేలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు రాబట్టింది. ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌ ద్వారా ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన జట్టుగా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును టీమిండియా సమం చేసింది.2026లో భారత జట్టు 9వ సారి 200 ప్లస్ స్కోరు సాధించింది. గతంలో 2024 క్యాలెండర్ సంవత్సరంలోనూ భారత్ 9 సార్లు 200 పరుగుల మార్కును దాటింది. ప్రపంచంలో ఏ ఇతర పూర్తి స్థాయి ఐసీసీ సభ్యత్వ దేశం కూడా ఒకే ఏడాదిలో 6 సార్లకు మించి 200 ప్లస్ స్కోర్లు చేయలేకపోయింది.

ఈ ఘనత పొట్టి ఫార్మాట్‌లో భారత బ్యాటింగ్ విభాగానికి ఉన్న ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ఓవరాల్ టీ20 క్రికెట్ చరిత్రలోనూ భారత జట్టు మరో రికార్డును మరింత పదిలం చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ 200 మార్కును అందుకోవడం ఇది 52వ సారి కావడం విశేషం. ఈ జాబితాలో భారత్ తర్వాత రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కేవలం 29 సార్లు మాత్రమే 200 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. భారత్‌కు ఇతర ప్రపంచ దేశాలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసానికి ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

జింబాబ్వేతో రెండో టీ20లో భారత్ 90 రన్స్ తేడాతో గెలిచింది.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లు సమష్టిగా రాణించి భారీ విజయాన్ని అందించారు.జింబాబ్వేను 129 పరుగులకే ఆలౌట్ చేసారు.పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన అభిషేక్ శర్మ అద్భుతమైన బౌలింగ్‌తో జింబాబ్వే మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అతను కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు.అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసి రాణించగా, రవి బిష్ణోయ్, శివం దూబే తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాను డకౌట్ చేయడం ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది.

Published : 
  • 27 July 2026, 7:09 PM IST