న్యూజిలాండ్ కు బిగ్ షాక్ రెండో టెస్టుకూ కేన్ మామ దూరం

బెంగళూరు టెస్టులో గెలిచి ఫుల్ జోష్ ఉన్న న్యూజిలాండ్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం తొలి టెస్టుకు అందుబాటులో లేని కేన్ విలియమ్సన్ ఇంకా కోలుకోలేదు. దీంతో గురువారం నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టుకూ అతను దూరం కానున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 23 October 2024, 3:52 PM IST

బెంగళూరు టెస్టులో గెలిచి ఫుల్ జోష్ ఉన్న న్యూజిలాండ్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం తొలి టెస్టుకు అందుబాటులో లేని కేన్ విలియమ్సన్ ఇంకా కోలుకోలేదు. దీంతో గురువారం నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టుకూ అతను దూరం కానున్నాడు. గాయం నుంచి విలియమ్సన్ ఇంకా కోలుకోలేదని, పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పాడు. మూడో టెస్ట్‌కు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నామని చెప్పాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు విలియమ్సన్‌కు తగిన సమయం ఇస్తామని, అతని విషయంలో తొందరపడడం లేదన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో విలియమ్సన్ గాయపడ్డాడు.అయితే విలియమ్సన్ లేకున్నా కూడా న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో సంచలన విజయాన్నందుకుంది.

Published : 
  • 23 October 2024, 3:52 PM IST