ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడుతూనే ఉన్నారు. నాథన్ ఎలిస్ గాయం కారణంగా సీజన్ ప్రారంభానికి ముందే దూరమవగా ఇప్పుడు ఫామ్‌లో ఉన్న ఖలీల్ అహ్మద్ రూలుడ్ అవుట్ అయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యాడు. దాంతో ఆఖరి బంతి వేయకుండానే గ్రౌండ్ బయటకు వెళ్లిపోయాడు.ఖలీల్ అహ్మద్ సీజన్‌కు దూరమైన విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీవిశ్వనాథే నేరుగా వెల్లడించారు. 28 సంవత్సరాల ఖలీల్ అహ్మద్‌కు తొడ కండరాల సమస్య తీవ్రంగా ఉందని, ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేకపోవడంతోనే సీజన్‌ను దూరమైనట్లు ఆయన వివరించారు.
ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టిన సీఎస్కే ఫ్యాన్స్‌కు ఖలీల్ అహ్మద్ దూరమైన వార్త మింగుడు పడటం లేదు.ఈ సీజన్‌కు దూరమై ఖలీల్ అహ్మద్ స్థానంలో ఎవర్ని రీ ప్లేస్ చేస్తారు అనే విషయం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేతిలోనే ఉందంటూ కాశీవిశ్వనాథ్ పేర్కొన్నారు. నాథన్ ఎలీస్ స్థానంలో జట్టులోకి వచ్చిన స్పెన్సార్ జాన్సన్ ఇప్పటి వరకు జట్టులో జాయిన్ కాలేదు. జాన్సన్ కొంతకాలంగా గాయంతో బాధపడుతుండటంతో జట్టుకు దూరమవ్వాల్సి వచ్చింది. ఖలీల్ అహ్మద్ ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు తీసుకున్నాడు. మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్‌ని ఈ సీజన్ గాయలతో ఇబ్బంది పెడుతోంది.
ఎప్పుడెప్పుడు ఎంఎస్ ధోనీని చూస్తామనుకుంటున్న సీఎస్కే ఫ్యాన్స్‌కి ఇప్పటి వరకు ఆ అవకాశం దక్కలేదు. తొలుత రెండు వారాల పాటు విశ్రాంతి అని చెప్పిన మేనేజ్‌మెంట్, ఇప్పుడు పూర్తిగా నయమైతేనే వస్తాడని చెబుతోంది. ప్రస్తుతానికి ఫిట్‌నెస్ పరంగా పర్ఫెక్ట్‌గా ఉన్న ధోనీ త్వరలోనే జట్టుతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 18న సన్‌రైజర్స్‌తో హైదరాబాద్ మ్యాచ్‌లో ఆడడం కూడా డౌటే. ఇదిలా ఉంచే ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న సీఎస్కే వెంటనే కమ్ బ్యాక్ ఇచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన సీఎస్కే, కేకేఆర్‌పై కూడా డామినేటింగ్ విక్టరీతో ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. గత సీజన్‌లో అట్టడుగు స్థానానికి పరిమితమైన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఏడాది ఏ ప్లేస్‌లో నిలుస్తుందో వేచి చూడాలి.