Spl story:మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత.!

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒక సారి ఎంపీగా పని చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ సుదీర్ఘంగా ఉద్యమాన్ని చేశారు.

Post Published By: dialnews
Updated : 15 July 2026, 12:52 PM IST

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒక సారి ఎంపీగా పని చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ సుదీర్ఘంగా ఉద్యమాన్ని చేశారు. జనతా పార్టీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల తరపున విజయం సాధించారు.కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...తుది శ్వాస విడిచారు. కాపు రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాడారు.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లో తెలుగు కాపు కుటుంబంలో జన్మించారు ముద్రగడ పద్మనాభం. ఆయన తండ్రి పేరు వీర రాఘవరావు. పద్మనాభం పాఠశాల విద్యను స్వగ్రామంలోనే సాగింది. ముద్రగడది రాజకీయ కుటుంబం. ముద్రగడ తాత పద్మనాభం మున్సబ్. తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో యాక్టివ్‌గా పని చేశారు. తండ్రి వీర రాఘవ రావు 1962, 1967లో రెండుసార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమాన పాత్రుడైన ముద్రగడ వీర రాఘవరావు....1977లో చనిపోయారు. అప్పుడే పాలిటిక్స్ లోకి రావాలని నీలం సంజీవరెడ్డి ముద్రగడ పద్మనాభంకుసూచించారు. నీలం సంజీవ రెడ్డి పిలుపు మేరకు ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది.

1978లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1978 నుంచి 1989 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు ముద్రగడ. 1982లో ఎన్టీ రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన ముద్రగడ అంతర్గత విభేదాలతో తన మంత్రి పదవీతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత ప్రజారక్షణ సమితి అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. తెలుగుదేశం నేత కెఇ కృష్ణమూర్తి, కె జానా రెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా వ్యవహరించారు. రెండుసార్లు మంత్రిగా చేశారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గంలో చేశారు.

1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. 1989 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి పోటీచేసి విజయం సాధించారు. కానీ, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓటమిపాలయ్యారు. ఓటమితో నిర్వేదానికి లోనైనా ఆయన మరోసారి ప్రతిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. ఆ తరువాత 1999లో తెలుగుదేశం పార్టీ తరపున కాకినాడ పార్లమెంట్‌కు పోటీ విజయం సాధించారు. 2004 ఎన్నికల్లోనూ పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి పిఠాపురం నుంచి పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత 2019లో పిఠాపురం నుంచి మరోసారి ఓటమి పాలయ్యారు.

1994లో కాపురిజర్వేషన్లపై ఉద్యమం ప్రారభించారు ముద్రగడ. ప్రభుత్వాలు మారుతున్నా...కాపు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి పురోగతి లేదని భావించిన ముద్రగడ 1994 జూలై 1న కాపు, బలిజ, ఒంటరి తెల్లగా కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని, ఆయన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు.2016 జనవరి 31న...తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభతో ఉద్యమాన్ని కదంతొక్కించారు ముద్రగడ. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ఇంటికి అతిథిగా ఎవరొచ్చినా...ఆప్యాంగా భోజనం పెట్టడం ఆయనకు అలవాటు. ఉప్మా, కాఫీ ముద్రగడ ఇంట్లో స్పెషల్. ముద్రగడ మరణం కాపు ఉద్యమానికి తీరని లోటు అని, ఆయన అభిమానులు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు.

Published : 
  • 15 July 2026, 12:52 PM IST