చిక్కుల్లో ఢిల్లీ క్యాపిటల్స్.. ప్లేయర్ రేప్ కేసులో అభిషేక్ పోరెల్‌ అరెస్ట్..!

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మెడికల్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన రేప్, బెదిరింపుల కేసులో బెంగాల్‌కు చెందిన అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Post Published By: dialnews
Updated : 12 August 2026, 1:05 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మెడికల్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన రేప్, బెదిరింపుల కేసులో బెంగాల్‌కు చెందిన అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం కర్ణాటకకు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ హుగ్లీలోని మోగ్రా పోలీస్ స్టేషన్‌లో అభిషేక్‌ పోరెల్‌పై ఫిర్యాదు చేశారు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇద్దరం కలిసి విదేశీ టూర్స్‌కు కూడా వెళ్లామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గతేడాది తామిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, అభిషేక్ పోరెల్ తనపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు.

ఈ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అభిషేక్‌ పోరెల్‌ను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించినా.. అతను అందుబాటులోకి రాలేదు. దాంతో ఆ యువతి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించగా.. అభిషేక్ పోరెల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో మంగళవారం అభిషేక్ పోరెల్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే సదరు యువతి ఆరోపణలను గతంలో అభిషేక్ పోరెల్ ఖండించాడు.వికెట్ కీపర్ కమ్ లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన అభిషేక్ పోరెల్.. 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 35 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో25.63 సగటుతో 769 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 65. ఐపీఎల్ 2026 సీజన్‌లో 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అభిషేక్ పోరెల్ 27 సగటుతో 108 పరుగులే చేశాడు.

బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే అభిషేక్ పోరెల్.. 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 31.28 సగటుతో 1408 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్ తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న అభిషేక్ పోరెల్.. తాజా కేసుతో చిక్కుల్లో పడ్డాడు. ఈ కేసుతో అభిషేక్ పోరెల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసు కారణంగా ఈ సీజన్ దేశవాళీ క్రికెట్ మొత్తానికి అతను దూరం కానున్నాడు. ఈ కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకపోతే.. ఐపీఎల్ 2027 సీజన్‌కు కూడా దూరమవుతాడు. ఇప్పటికే ఆర్‌సీబీ స్టార్ యశ్ దయాల్ ఇదే తరహా అత్యాచార కేసుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

Published : 
  • 12 August 2026, 1:05 PM IST