సూపర్‌స్టార్ రజినీకాంత్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ గురించి ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. థియేటర్లలో విడుదల కాకముందే ఈ సినిమా కోట్లలో బిజినెస్ చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది.ఏకంగా 160 కోట్లు ఇచ్చి ఈ భారీ సీక్వెల్ డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ ఓటీటీ డీల్స్‌లో ఒకటిగా ఇది నిలిచింది.
‘జైలర్’ మొదటి భాగం డిజిటల్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడవ్వగా, ఇప్పుడు రెండో భాగానికి దానికి మించి డీల్ కుదరడం నెల్సన్-రజినీ క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో రజినీకాంత్ మరోసారి తన మార్క్ మాస్ క్యారెక్టర్ ‘టైగర్ ముత్తువేల్ పాండ్యన్’గా అలరించనున్నారు. మొదటి భాగంలో అలరించిన పాత్రలతో పాటు ఈసారి మరికొన్ని పాత్రలు కీలకంగా మారబోతున్నాయి.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న బీజీఎమ్స్, పాటలు ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కి ముందే ఓటీటీ రూపంలో ఈ స్థాయిలో 160 కోట్ల భారీ మొత్తం దక్కడంతో మేకర్స్ ఇప్పటికే సేఫ్ జోన్లోకి వెళ్లడమే కాకుండా, లాభాల బాట పట్టినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్టోబర్ 15, 2026న విడుదల కానున్న ఈ మూవీ థియేటర్లలో ఏ స్థాయి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.