తెలంగాణ జానపద పాటలకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్‌లలో రోజూ పదుల సంఖ్యలో ఫోక్ సాంగ్స్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ జానపద కళారంగం ద్వారా ఎంతో మంది యువ కళాకారులు వెలుగులోకి వచ్చి తమ నటనతో, గాత్రంతో మంచి ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ ఫోక్ ఆర్టిస్టుల వ్యక్తిగత విషయాలు, వివాదాలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. తాజాగా అలాంటి ఒక సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చి, ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి ప్రస్తుతం ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. మరొక మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో కలిసి ఒక గదిలో ఉన్న సమయంలో ఆయన భార్య వారిని గమనించి, అక్కడికి చేరుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
ఈ వివాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రైవేట్ వీడియోల రూపంలో నెట్టింట ప్రత్యక్షమై, క్షణాల్లో వైరల్‌గా మారాయి. ప్రచారం అవుతున్న వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రెడ్డి భవన్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈశ్వర్ సాయి మరియు సదరు మహిళా ఆర్టిస్ట్ ఒక గదిలో ఉన్నారనే సమాచారంతో ఆయన భార్య అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక యువతి బెడ్‌పై కూర్చుని ఉండగా, ఈశ్వర్ సాయి బాత్‌రూమ్ నుంచి బయటకు వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీరిద్దరినీ చూసిన ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే వారిని నిలదీయడంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ, తీవ్రమైన వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. గదిలో ఇద్దరినీ ఒకేసారి చూసిన భార్య, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
అయితే వీడియోలో కనిపించిన పరిస్థితుల ఆధారంగా వారి మధ్య వ్యక్తిగత సంబంధం ఏమిటనేది పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోయినప్పటికీ, ఈ సంఘటన స్థానికంగా పెద్ద రచ్చకు దారితీసింది. భార్య సమక్షంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో, ఈ వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈశ్వర్ సాయి భార్య ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ జానపద ప్రపంచంలో ఈశ్వర్ సాయికి మంచి పేరుంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన 'బాసింగ బలాలు' అనే ఫోక్ సాంగ్ ఆయనకు విపరీతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈశ్వర్ సాయి, వైష్ణవి సోనీ నటించిన ఈ పాట సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయింది. విడుదలైన కొద్ది వారాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి, పెళ్లిళ్లు, డిజే ఈవెంట్స్ మరియు పండుగల్లో మారుమోగిపోయింది. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, వాగ్వాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాత్రికి రాత్రే ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేసింది. వివాదం వెనుక అసలు నిజానిజాలు ఏమిటనేది పోలీస్ దర్యాప్తులో తేలాల్సి ఉంది.