ఉన్నదీ పోయింది.. కోరుకున్నదీ పోయింది.. చివరికి సంబంధం లేనిదేదో దక్కింది. మంత్రి జోగి రమేష్ మీద పడుతున్న పొలిటికల్ సెటైర్స్ (Political satires) ఇవి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో (Krishna District) ఏకైక మంత్రిగా ఉన్నారు జోగి రమేష్ (Jogi Ramesh). గత ఎన్నికల్లో పెడన నుంచి జోగి గెలవగా.. ఇప్పుడు అధిష్టానం అక్కడ నుంచి తప్పించింది. పెడనలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. తప్పించారనేది పార్టీ వర్గాల మాట.
