AP Politics : పవన్‌ ఓ గంగిరెద్దు.. అంత మాట అన్నావేంటి అంబటి బ్రో..

ఏపీలో రాజకీయం (AP Politics) హాట్‌హాట్‌గా మారుతోంది. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే.. పాలిటిక్స్ సెగలు పుట్టిస్తున్నాయ్. మాటలు తూటాలకు మించి స్పీడ్‌గా పేలుతుంటే.. ఆరోపణలకు హద్దుల్లేకుండా పోతున్నాయ్. చంద్రబాబు (Chandrababu) , పవన్‌ డిన్నర్ మీట్ తర్వాత.. రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 January 2024, 3:00 PM IST

Pawan is a gangereddu.. Bro, why did you say that?

ఏపీలో రాజకీయం (AP Politics) హాట్‌హాట్‌గా మారుతోంది. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే.. పాలిటిక్స్ సెగలు పుట్టిస్తున్నాయ్. మాటలు తూటాలకు మించి స్పీడ్‌గా పేలుతుంటే.. ఆరోపణలకు హద్దుల్లేకుండా పోతున్నాయ్. చంద్రబాబు (Chandrababu) , పవన్‌ డిన్నర్ మీట్ తర్వాత.. రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. భోగి వేడుకల్లో పవన్‌, చంద్రబాబు కలిసి పాల్గొనడం.. కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇద్దరు కలిసి పండగలో పాల్గొనడంపై వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అయితే.. మరింత హద్దు దాటారు. పవన్‌ను గంగిరెద్దు అంటూ కామెంట్లు చేశారు. దీంతో అంబటి ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు, పవన్ ఫొటోను (Power Kalyan) ట్వీట్ చేస్తూ.. మంత్రి అంబటి చేసిన కామెంట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సంక్రాంతి (Makar Sankranti) సందర్భంగా ఆదివారం మందడంలో నిర్వహించిన వేడుకల్లో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు.. గంగిరెద్దు పక్కన నిలబడి ఫొటో దిగారు. ఈ ఫొటోను టీడీపీ, జనసేన నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఈ ఫొటోను షేర్ చేస్తూ.. బాబు పక్కన రెండు గంగిరెద్దులు అంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు, టీడీపీ (TDP), జనసేన (Janasena) అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా మంత్రి తీరును తప్పు పడుతున్నారు. నిజానికి పవన్ కల్యాణ్‌ అనగానే.. వెంటనే మీడియా ముందుకు వచ్చి కనిపించే నేతల్లో.. అంబటి రాంబాబు మొదటి వరుసలో ఉంటారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా.. పవన్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు.

దీంతో అంబటిని జనసైనికులు కూడా టార్గెట్ చేశారు. ట్రోల్స్, మీమ్స్ రూపంలో.. ఆట ఆడుకుంటారు. ఇలా పవన్ వర్సెస్ అంబటి యుద్దం ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. ఆ మధ్య బ్రో సినిమాలో అంబటి స్ఫూఫ్‌ కేరక్టర్ పెట్టించి.. పబ్‌లో డ్యాన్స్ వేయించారన్న ఇష్యూ మీద.. అంబటికి, జనసైనికుల మధ్య జరిగన యుద్ధం అంతా ఇంతా కాదు. ఈ సంక్రాంతికి కూడా అంబటి డ్యాన్సులు వేశారు. సేమ్ డ్రెస్‌.. సేమ్ స్టెప్పులు అన్నట్లు అనిపించారు అంబటి. మరి ఇప్పుడు పవన్‌ను గంగిరెద్దు అంటూ అంబటి కామెంట్‌ చేయడంతో.. జనసైనికులు ఎంత వైల్డ్‌గా రియాక్ట్ అవుతారన్నది హాట్‌టాపిక్‌ అవుతోంది.

Published : 
  • 14 January 2024, 3:00 PM IST