AS Ravi Kumar Chowdary: ఆ డైరెక్టర్ మరో రాకేష్ మాస్టర్‌లా మారిపోతున్నారా..?

ఏఎస్ రవికుమార్ చౌదరి అప్పట్లో గోపిచంద్‌తో యజ్ఞం సినిమా తీసి మంచి హిట్‌ కొట్టారు. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతోనూ ఆకట్టుకున్నారు. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. వరుస ఫ్లాప్‌లు ఆయనను ఇండస్ట్రీకి దూరం చేశాయి.

Post Published By: narender Thiru
Updated : 3 September 2023, 4:07 PM IST

AS Ravi Kumar Chowdary: సినిమా ఇండస్ట్రీ అంటే ఓ చెడ్డ పేరు ఉండేది ఒకప్పుడు. ఐతే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. దీన్ని కూడా ప్రొఫెషన్‌లాగా ఎంచుకుంటున్నారు చాలామంది యువకులు. ఐతే కొందరి తీరు.. కొందరి వివాదాలు.. ఇండస్ట్రీ మీద మరిన్ని అనుమానాలకు కారణం అవుతున్నాయి. సినిమావాళ్లు ఎవరైనా సరే.. వాళ్ల సినిమాలు వాళ్లు చేసుకుంటూ పోతే.. ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. ఐతే అలా కాదని వివాదాలు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకు అంటే.. ఒక్క డైరెక్టర్ వ్యవహారంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయనే.. ఏఎస్ రవికుమార్ చౌదరి. అప్పట్లో గోపిచంద్‌తో యజ్ఞం సినిమా తీసి మంచి హిట్‌ కొట్టారు. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతోనూ ఆకట్టుకున్నారు. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. వరుస ఫ్లాప్‌లు ఆయనను ఇండస్ట్రీకి దూరం చేశాయి. దీంతో మద్యానికి బానిస అయ్యారు. ఇక్కడితో ఆగితే అంతా బాగానే ఉండేది. ఇక్కడే ఆయన హద్దులు దాటుతున్నాడు. మరో రాకేశ్ మాస్టర్‌లా మారుతున్నాడుమేడో అనిపించుకుంటున్నాడు. రీసెంట్‌గా రాజ్‌తరుణ్‌ హీరోగా తిరగబడరా సామి అనే సినిమా చేశాడు చౌదరి. ఇటీవలే ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ మన్నారా చోప్రాకి ముద్దు పెట్టి రచ్చ లేపాడు.

ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీలో హీరోలనే టార్గెట్ చేస్తున్నాడు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇండస్ట్రీలో ఉన్న హీరోల గురించి.. డైరక్టర్ల గురించి వల్గర్‌గా మాట్లాడుతున్నారు. దీంతో ఈయన ప్రవర్తన చూస్తున్న జనాలు.. మరో రాకేశ్‌ మాస్టర్‌లా తయారయ్యాడు ఏంటి అని అనుకుంటున్నారు.

Published : 
  • 3 September 2023, 4:07 PM IST