Ashika Ranganath: మెగా ఛాన్స్.. ఆషికా వర్క్ అవుట్స్.. చిరంజీవి సినిమా కోసమేనా..?

ఇన్ని రోజులు ఆషికా చాలా సుకుమారంగా ఉంటుందేమోనని అనుకున్నాం. కానీ ఇంత రఫ్ అండ్ టఫ్‌గా వర్క్ అవుట్స్ చేస్తుందనుకోలేదు అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. శరీరాన్ని రబ్బర్‌లా ఎలా పడితే అలా వంచుతూ, ఎన్నో కఠినమైన వర్క్ అవుట్స్‌ని చాలా ఈజీగా చేసింది.

Post Published By: narender Thiru
Updated : 22 February 2024, 3:04 PM IST

Ashika Ranganath: కింగ్ నాగార్జున నుంచి మొన్న సంక్రాంతికి వచ్చిన మూవీ నా సామి రంగ. ఆ మూవీలో నాగ్ ప్రేయసిగా నటించి అశేష సినీ ప్రేక్షకులని తన అందంతో మైమరింపచేసిన ముద్దుగుమ్మ ఆషికా రంగనాధ్. తాజాగా సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీ నామజపంతో ఊగిపోతుంది. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోని ఆషికా ఇనిస్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో చూస్తున్న వాళ్లందరు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Upasana Kamineni: ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నా..!

ఇన్ని రోజులు ఆషికా చాలా సుకుమారంగా ఉంటుందేమోనని అనుకున్నాం. కానీ ఇంత రఫ్ అండ్ టఫ్‌గా వర్క్ అవుట్స్ చేస్తుందనుకోలేదు అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. శరీరాన్ని రబ్బర్‌లా ఎలా పడితే అలా వంచుతూ, ఎన్నో కఠినమైన వర్క్ అవుట్స్‌ని చాలా ఈజీగా చేసింది. కొంత మంది ఆషికాకి కొత్త సినిమా ఆఫర్ ఏమైనా వచ్చిందేమోనని అనుకుంటున్నారు. ఇదే టైంలో మెగాస్టార్ నయా మూవీ విశ్వంభరలో ఆమె నటించబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ మూవీతో ఆషికా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.

కానీ నా సామిరంగ మూవీతో మాత్రం మంచి పేరు, అభిమానులని సంపాదించుకుంది. చిరు విశ్వంభరలో అవకాశం వస్తే మాత్రం ఆమె దశ తిరిగినట్టే. కాగా ఇటీవల చిరు న జిమ్ వీడియోని రిలీజ్ చెయ్యడంతో ఇప్పుడు ఆషికా జిమ్ వీడియో ఎట్రాక్షన్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Ashika Ranganath (@ashika_rangnath)

Published : 
  • 22 February 2024, 3:04 PM IST