మాస్ ఎలివేషన్ కాదు.. మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సందీప్ చేస్తున్న డ్రాగన్ మూవీలో ఉండేది మాస్ ఎలివేషన్లు కాదు..మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్లు... ఎందుకంటే డ్రాగన్

  • Written By:
  • Updated On - January 29, 2026 / 02:23 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సందీప్ చేస్తున్న డ్రాగన్ మూవీలో ఉండేది మాస్ ఎలివేషన్లు కాదు..మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్లు… ఎందుకంటే డ్రాగన్ లో తన పాత్రేంటి, జోనర్, ఫ్లేవర్ ఏంటనే దాని మీద ఫిల్మ్ నగర్ సర్కిల్లో జనాలు ఒక క్లారిటీకి వచ్చారు.. దాని ప్రకారం, ఇందులో హీరో కేజీయఫ్ రాఖీబాయ్ లానో, సలార్ స్టైల్లో బ్యాగ్ గ్రౌండో ఉంటుందనే అంచనాలతో ఉన్నారు. కాని ప్రశాంత్ నీల్ పూర్తిగా కొత్త జోనర్ లో ఈ సినిమాను తీస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ అంటే పంచ్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఇవే ఊహిస్తారు.. కాని ఫస్ట్ టైం డైలాగ్స్ కి ఆల్ మోసం అంటే 70 పర్సెంట్ పక్కన పెట్టి, కంటిచూపుతో చంపేసే పాత్రలేస్తున్నాడని తెలుస్తోంది. ఓరకంగా తను నిశ్శబ్ధంతో చంపేయబోతున్నాడు. తన ఎనర్జీ, వాయిస్, పవర్ ని కాదని, తనలోని మరో కోణానికి పని చెబుతున్నాడు. కాబట్టే ఇది తన కెరీర్ లోనే త్రిబుల్ ఆర్ తో పోలిస్తే కూడా ఫేట్ మార్చే ట్రెండ్ సెట్టర్ అని నమ్ముతున్నాడు… జోనర్ కూడా అలానే విచిత్రంగా ఉండేలా ఉంది. ఇంతకీ ప్రశాంత్ నీల్ అంతగా ఎలాంటి జోనర్ లో ఎన్టీఆర్ ని ఇంకెలా చూపించబోతున్నాడు?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్ట్రెంథ్ సాలిడ్ డైలాగ్ డెవిలరి… కాని ఇప్పుడా డైలాగ్స్ కే బ్రేక్ వేస్తే… ప్రశాంత్ నీల్ అదే చేస్తున్నాడు.. డ్రాగన్ మూవీ ఎన్టీఆర్ ని పాన్ ఇండియా లెవల్లో వెలిగిపోయేలా చేసేందుకు చేసే ప్రయత్నం కాదు.. నిజానికి ఎన్టీఆర్ కొత్తగా పాన్ ఇండియా లెవల్లో ప్రూవ్ చేసుకోడానికేం లేదు. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా, దేవరతో పాన్ ఇండియా లెవల్లో హిట్లు పడ్డాయి..పాన్ వరల్డ్ మార్కెట్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకే తన ప్రతీ మూవీ విషయంలో చాలా పక్కాగా ముందుకెళుతున్నాడు ఎన్టీఆర్. అయితే తనకి ఎంతో స్ట్రెంత్ అయిన, ఎనర్జీ, వాయిస్, మాస్ పవర్ ని పక్కన పెట్టి, హైలీ ఇంటెలీజెంట్ పాత్రకి, థ్రిల్లర్ జోనర్ ని యాడ్ చేస్తే… నిజానికి ఇవి ఎన్టీఆర్ కప్ ఆ ఫ్ టీ కాదు… ఎన్టీఆర్ అంటేనే మాస్ మైండ్ బ్లాంక్ అవ్వాలి..

డాన్స్, ఫైట్స్, బాక్స్ బద్దలయ్యే పంచ్ డైలగ్స్ పడాల్సిందే… కాని ఇవేవి లేకుండా తన మూవీని ఊహించుకోలేం.. కాని అదే జరుగుతోంది. డ్రాగన్ రెగ్యులర్ మాస్ మూవీ కాదు. అలాని క్లాస్ కహనీ కాదు.. ఇంటెలీజెంట్ హీరోయిజం, ట్విస్ట్ లమీద ట్విస్ట్ లతో కూడుకున్న థ్రిల్లర్ జోనర్.. బేసిగ్గా థ్రిల్లర్ లో చాలా పాత్రలు తెలివిగా ఉంటాయి.. థ్రిల్ కి గురిచేసే ట్విస్టులుంటాయి…ఇది కామన్, కాని హీరోని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయేమో అనిపించే స్థాయి హైపర్ ఇంటలీజెంట్ గా చూపించటం జరగదు.. కాని అదే డ్రాగన్ లో జరుగుతోందట. అందుకోసం థ్రిల్లర్ జోనరే ఎంచుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇది నార్త్ ఈస్ట్ ఇండయా బ్యాక్ డ్రాప్ లో డ్రగ్స్ మాఫియా కోనంలోనే వస్తోంది.. ఆప్రికా, ఆసియా, యూరప్ చుట్టూ కథ తిరుగుుతంది.

కాని ఇందులో 12 మంది విలన్స్, ఒకరిని మించి ఒకరు తెలివైన బ్యాచ్.. వాళ్ళందరిని మించే ముదురుగా ఎన్టీఆర్.. ఇది డ్రాగన్ లో ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రయోగం. ఆల్రెడీ నాన్నకు ప్రేమతో మూవీలో ఎన్టీఆర్ స్టైలిష్ గా, హైలీ ఇంటెలీజెంట్ రోల్ లో కనిపించాడు. థ్రిల్లర్ జోనర్ చేశాడు.. కాబట్టి డ్రాగన్ తో ఎన్టీఆర్ కొత్త జోనర్ లోకి ఎంటరవుతున్నాడనుకోలేమే మాటలు వినిపించొచ్చు.. కాని అక్కడే ట్విస్ట్ ఉంది… నాన్నకు ప్రేమతో పాత్రకు కొన్ని వందలరెట్లు ఊహాతీతమైన రెండు పాత్రలు డ్రాగన్ లో వేస్తున్నాడట ఎన్టీఆర్. సినిమాలో 80శాతం డైలాగ్సే ఉండవంటే, స్క్రిప్ట్ వర్క్ ఎంత టైట్ గా రాసుకుని ఉంటారు.. ఏదేమైనా బాలయ్యని సింహా మూవీలో తక్కువ డైలాగ్స్ తో, ఎక్కువ సైలెన్స్ తో వైలెన్స్ ని చూపించిన బోయపాటి స్ట్రాటజీ లానే కనిపిస్తోంది డ్రాగన్ విషయంలో ప్రశాంత్ నీల్ చేసేది… టీజర్ వస్తేనే ఈ సైలెన్స్ వెనకున్న వైలెన్స్ ఏ స్థాయిలో రీసౌండ్ చేస్తుందో తెలుస్తుంది.