మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్స్ కామన్.. తనేం సినిమాలు చేస్తున్నాడు.. అవెంతవరకొచ్చాయి…డ్రాగన్ టీజర్ ఎప్పుడు ఇలాంటి వార్తలు చాలా రొటీన్.. కాని ఇప్పుడో న్యూస్ తెలుగు జనాల్లో మరీ ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో విచిత్రంగా రీసౌండ్ చేస్తోంది.. అదే నందమూరి నటసింహాల్లో ఎవరు చాలా రిచ్…? గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యే సీనియర్, ప్లస్ ఎప్పటి నుంచో తనో టాప్ స్టార్ కాబట్టి డెఫినెట్ గా తనే నందమూరి ఫ్యామిలీలో రిచీ రిచ్.. అది ఓకే కాని ఎంత రిచ్.. నెంబర్స్ ఏంటి? అక్కడే 1000 కోట్ల నెంబర్ వినిపిస్తోంది. 500 కోట్లతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్ లో ఉంటే, కళ్యాణ్ రామ్ మూడో ప్లేస్ లో ఉన్నాడట. విచిత్రంగా ఉంది ఎన్టీఆర్ సినిమాకే 200 నుంచి 300 కోట్లు తీసుకునే వరకు ఎదిగినప్పుడు, తన ఆస్తులు 500 కోట్లేనా? అక్కడే ట్విస్ట్ ఉంది?.. అలా చూస్తే ఆవిషయంలో బాబాయ్ బాబాయే… అబ్బాయ్ అబ్బాయే… ఇంతకి ఏంటా ట్విస్ట్?
నటసింహం బాలయ్య, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, అలానే మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ ముగ్గురే నందమూరి ఫ్యామిలీ ట్రీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో సీరియస్ గా కన్ సిస్టెంట్ గా సినిమాలు చేస్తూ, మార్కెట్ ని హోల్డ్ చేస్తోంది… అయితే ఇందులో ఎవరు రిచ్ అన్న ప్రశ్నే విచిత్రం.. దానికి దొరికిన సమాధానం కూడా చాలా విచిత్రంగానే ఉంది.నటసింహం బాలయ్య స్థిర ఆస్తుల విలువ 990 కోట్ల నుంచి 1100 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈవిషయంలో 535 కోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనంటున్నారు. కళ్యాణ్ రామ్ స్థిరాస్తుల విలువ 448 కోట్లనగానే ఇక్కడే క్లారిటీ మిస్ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరకే 180 కోట్లు తీసుకున్నాడన్నారు. ప్రాఫిట్స్ లో షేర్ కలిపితే 250 కోట్ల వరకు టోటల్ ఎమౌంట్ దక్కిందంటున్నారు.
ఇక డ్రాగన్ మూవీకి తన రెమ్యునరేషన్ ప్రాఫిట్స్ లోషేర్ లెక్కేస్తే 300 కోట్ల నుంచి 380 కోట్లుండొచ్చనంటున్నారు. త్రిబుల్ ఆర్ కి ఏకంగా 150 కోట్లు తీసుకున్నాడు. ఇలా లెక్కేసినా తన మూడు సినిమాల రెమ్యూనరేషన్లే 600 కోట్లు దాటుతున్నాయి… అలాంటప్పుడు 550 కోట్ల స్థిరాస్తులనేదే లాజిక్ కి అర్దం కావట్లేదు. కాని ఇదే నిజం… కాకపోతే సగమే నిజం..ఎందుకంటే 550 కోట్లు నిజానికి ఎన్టీఆర్ స్థిరాస్తుల విలువకాదు.. తను పెట్టుబడి పెట్టిన ప్రాపర్టీస్ విలువ..
అలాచూస్తే బాలయ్య ల్యాండ్ మీద, ఇతరత్రా స్థిరాస్తుల మీద పెట్టిన పెట్టుబడి విలువ 1100 కోట్ల పైనే… అలాచూస్తే బాబాయ్ నెంబర్ వన్ అయితే, నెంబర్ 2గా ఎన్టీఆర్, నెంబర్ 3గా కళ్యాణ్ రామ్ ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ స్టార్స్ లో వీల్ల స్థిరాస్తి పెట్టుబడులు కూడా ఘనంగానే ఉన్నాయి.ఐతే లిక్విడ్ ఎమౌంట్ ని, షేర్స్ లో ఇతరత్ర అంశాల్లో పెట్టుబడి పెట్టడంతో ఎన్టీఆర్ మాత్రం బాలయ్యని మించిపోయాడు. కొత్తగా క్లాత్ బిజినెస్ లోకి కూడా తను దిగబోతున్నాడు. అందుకు తను 300 కోట్లు పెట్టుబడి పెడితే, షేర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ విషయంలో 200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాడట. నందమూరి నటసింహాల్లో ఈ తరహా కోణం కూడా వార్తగా మారింది.