LCU ఉంది.. నా గురించి తప్పుగా రాస్తే ఊరుకోను.. అంతా అల్లు అర్జున్ కారణంగానే..!

కూలీ సినిమాకు ముందు రేసుగుర్రంలా ఉన్న లోకేష్ కనకరాజ్ కెరీర్.. కూలీ తర్వాత గుడ్డి గుర్రంలా మారిపోయింది. కాస్త నెమ్మదించిన మాట వాస్తవమే అయినా..

  • Written By:
  • Publish Date - January 26, 2026 / 09:20 PM IST

కూలీ సినిమాకు ముందు రేసుగుర్రంలా ఉన్న లోకేష్ కనకరాజ్ కెరీర్.. కూలీ తర్వాత గుడ్డి గుర్రంలా మారిపోయింది. కాస్త నెమ్మదించిన మాట వాస్తవమే అయినా.. నెక్ట్స్ ఈయన ఖాతాలో పెద్ద సినిమాలే ఉన్నాయి. ఖైదీ 2 సినిమా వాయిదా పడటం, LCU భవిష్యత్తుపై వస్తున్న రకరకాల వార్తలకు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎట్టకేలకు చెక్ పెట్టాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ముఖ్యంగా పారితోషికం విషయంలో గొడవల వల్ల ఖైదీ 2 ఆగిపోయిందన్నది అవాస్తవమని ఆయన స్పష్టం చేశాడు. తన సినిమా లైనప్, ఎల్‌సీయూ కంటిన్యూయేషన్‌పై పూర్తి క్లారిటీ ఇస్తూ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్ ఇచ్చాడు. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఒక సినిమా గురించి వచ్చిన వార్తలపై లోకేష్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు లోకేష్. కూలీ తర్వాత వీరిద్దరూ కలిసి తనను అప్రోచ్ అయ్యారని, నిర్మాతల పర్మిషన్ తీసుకుని సుమారు నెలన్నర రోజులు స్క్రిప్ట్ వర్క్ కూడా చేశానని చెప్పారు.

వాళ్లు తన నుంచి ఒక వినోదాత్మక సినిమాను ఆశిస్తున్నారని.. ఆ జోనర్‌లో తనకు అంత పట్టు లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి నిజాయితీగా తప్పుకున్నట్లు వెల్లడించాడు లోకేష్. ఇదే సమయంలో హీరో కార్తీ ఖైదీ 2 కోసం కేటాయించిన డేట్స్‌ను వేరే దర్శకుడికి ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్ళింది. సరిగ్గా అదే టైంలో మైత్రీ మూవీ మేకర్స్‌తో ఉన్న కమిట్‌మెంట్, అల్లు అర్జున్‌తో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చలు ఫలించడంతో ఆ గ్యాప్‌ను బన్నీ సినిమాతో భర్తీ చేసినట్లు లోకేష్ వివరించాడు. అంతేకానీ ఇది ప్లాన్ చేసి మార్చింది కాదని, పరిస్థితులకు తగ్గట్టుగా సెట్ అయిన ప్రాజెక్ట్ అని చెప్పాడు. LCU అభిమానులకు లోకేష్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇంకా ముగిసిపోలేదని, త్వరలోనే గ్రాండ్‌గా రీ-ఓపెన్ అవుతుందని హామీ ఇచ్చాడు. అల్లు అర్జున్ సినిమా పూర్తయిన వెంటనే ఖైదీ 2 సెట్స్ పైకి వెళ్తుందని.. ఆ తర్వాత ‘విక్రమ్ 2’, సూర్యతో ‘రోలెక్స్’ సోలో మూవీ ఉంటాయని కన్ఫర్మ్ చేశారు.

అలాగే రాఘవ లారెన్స్ నటిస్తున్న ‘బెంజ్’ సినిమా కూడా ఎల్‌సీయూలో భాగమేనని అధికారికంగా ప్రకటించాడు లోకేష్ కనకరాజ్. అంతేకానీ తను ఎక్కువ పారితోషికం అడగడంతోనే ఖైదీ 2 ఆగిపోయిందనే వార్తల్లో అస్సలు నిజం లేదని కుండ బద్ధలు కొట్టాడు లోకేష్. తన గురించి ఉన్నవి లేనివి అబద్ధాలు రాయొద్దని కోరాడీయన. మొత్తానికి లోకేష్ కనగరాజ్ తన ప్లానింగ్‌లో చాలా క్లియర్‌గా ఉన్నాడు. తన బలం కాని జోనర్‌లోకి వెళ్లకూడదని నిర్ణయించుకోవడం, ఎల్‌సీయూని స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకెళ్లాలనే ఆయన విజన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి లోకేష్ సిద్ధమవుతుంటే, ఆ తర్వాత రాబోయే ఎల్‌సీయూ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.