మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి సాలిడ్ హిట్ తో సక్సెస్ అంటే సరిపోదు… దేశం మొత్తం ఉలిక్కి పడే బ్లాక్ బస్టర్ కావాలి… అందుకే త్రిబుల్ ఆర్ లేదంటే దేవరని మించే మూవీకోసం పరి తపిస్తున్నాడు. అందుకే తన ప్రతీ ప్రాజెక్ట్ మీద తన పూర్తి పట్టును కోరుకుంటున్నాడు. అందుకే కథ వస్తువు నుంచి ఫైనల్ స్క్రిప్ట్ వరకు అన్నీంటికి తన పేరే, తన కంట్రోలే ఉండాలి… ఇది మొదటి కండీషన్ అని తెలుస్తోంది. ఇంతకి ఈ కండీషన్ వెనకున్న మోటివేషన్ త్రివిక్రమ్ మోసం చేశాడనే ప్రచారమా? లేదంటే మరో కోణం కూడా ఉందా? ఏదేమైనా ప్రభాస్ కి బాహుబలి 2, బన్నీకి పుష్పరాజ్ 2 ఇచ్చిన కిక్ మామూలుగా లేదు… అంతకు మించే బ్లాక్ బస్టర్ పడితే తప్ప, దేశం మొత్తం ఉలిక్కి పడే ఛాన్స్ లేదు.. అందుకే డబుల్ డ్రాగన్స్ తో త్రిబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడా?ఈ సినిమా ఏకంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనేంత భారీతనంతో రాబోతోందా? ఆమధ్య ఓసారి, ఇప్పుడు ఇంకోసారి తీసుకుంటున్న సడన్ బ్రేకుల వెనకున్న రీజన్ ఇదే విజనా?
బాహుబలి 1 తో ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. కాని రెండేళ్ల తర్వాత వచ్చిన బాహుబలి 2 తోనే రెబల్ స్టార్ పదేళ్లైనా పాన్ ఇండియా కింగ్ గా ఉండేంత ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1850 కోట్ల వసూళ్లు అసలు లెక్కే కాదు… దేశం మొత్తం ఆ సినిమా చూసి ఉలిక్కి పడింది.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాష సినిమా, అన్ని భాషల్లో ఇలా అందరిని థియేటర్ల ముందు క్యూలు కట్టేలా చేసింది లేదు.. ఇదే తొలిసారి…
అంతే దెబ్బకి రాజమౌళి, ప్రభాస్ పేర్లు మారుమోగాయి… ఇప్పటికీ బాహుబలి 2 వల్ల వచ్చిన ఇమేజ్ నుంచి ప్రభాస్ బయట పడేందుకు కష్టపడి ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. సలార్, కల్కీ హిట్లు ఉన్నా, ఇంకా బాహుబలి ఇమేజ్ ప్రభాస్ కి కంగారు పెట్టిస్తోంది. కాబట్టే అందులోంచి బయట పడేందుకు మరో సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ప్రయోగాల మీద, ప్రయోగాలు చేస్తున్నాడు.ఇందంత డిస్కర్షన్ కి కారనం, ఇలాంటి ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి కూడా కావాలి. త్రిబుల్ ఆర్ తో వరల్డ్ వైడ్ గా పేరొచ్చింది. నాటు నాటు పాట, ఆస్కార్ స్టేజ్ నే షేక్ చేసింది. హాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు మారుమోగాయి.. కాని అలా సోలో హిట్ కాదు.. మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్.. దేవర సోలో హిట్టే.. కాని బాహుబలి 2 రేంజ్ పూనకాలు వసూల్లలో కనిపించాలి…
దేశం మొత్తం ఓ సినిమాకోసం మళ్లీ థియేటర్ ముందు క్యూ కట్టాలంటే బాహుబలి 2, పుష్ప2 రేంజ్ సెన్సేషనల్ వసూల్లు రావాలి…పుష్ప మొదటి భాగం వల్ల పుష్ప2 కి 1600 కోట్లొచ్చాయి..కాని మరీ బాహుబలి 2 రేంజ్ లో అది జనాల్లో పూనకాలు తెప్పించలేకపోయింది.. అందుకే అందరి టార్గెట్ బాహుబలి 2నే… అలాంటి మూవీ పడాలంటే, కథనకథనాలు, కంటెంట్, దాని మేకింగ్, అందుకు తగ్గ రిలీజ్ ప్లానింగ్ మార్కెటింగ్ ఉండాలి..
అందుకే త్రివిక్రమ్ తో కమిటైన మూవీ కథ కాపీ రైట్స్ ని తానే తసుకున్నాడట తారక్. అంతేకాదు డ్రాగన్ రెండు భాగాల మార్పు కూడా తన టీం చేసిందే అని తెలుస్తోంది. సో చేస్తున్న ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటైనా బాహుబలి 2 రేంజ్ ని మించేలా ఉండేందుకు తారకే రంగంలోకి దిగాడు.. కథ విషయంలో, మేకింగ్ విషయంలో తన ఇన్ వాల్వ్ మెంట్ పెరిగినట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే త్రివిక్రమ్ చెప్పిన కథని, తన టీంతో చేయించిన మార్పుల టైంలోనే కాపీ రైట్స్ సొంతం చేసుకున్నాడట.. అందుకే త్రివిక్రమ్ తన మైథలాజికల్ కథని బన్నీతో తీయటం కుదరదని, అలా చీట్ చేసే ఛాన్స్ లేదనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా 3 వేల కోట్ల వసూళ్ల హిట్ కోసం డ్రాగన్ లో డబుల్ డోస్ ని, గాడ్ ఆఫ్ వార్ లో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే కంటెంట్ ని పెంచే విషయంలో 12 మంది రైటర్ల సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తన కసి బాహుబలి 2 రేంజ్ ని మించే రిజల్ట్ కోసమన్న మాటే తూటా ప్రచారం జరుగుతోంది.