రెబల్ స్టార్ ప్రభాస్ ఫేట్ ని మార్చింది బాహుబలి. మళ్లీ తన కెరిర్ లో అలాంటి అద్భుతం రాలేదు.. ఆ సినిమా తో వచ్చిన ఇమేజ్ నుంచి బయట పడటానికే పదేళ్లు కూడా సరిపోవట్లేదు.. ఏక్షనాణ బాహుబలిని, ప్రభాస్, రాజమౌళి కమిటయ్యారో కాని, వాళ్లు కూడా ఇలాంటి అద్భుతం చేస్తామనుకుని ఉండరు.. ఏదో గొప్ప ప్రాజెక్ట్ చేస్తున్నా, వర్కవుట్ అవుతుందా లేదా అన్న డౌట్ కూడా ఏదో ఒక మూలన ఉండే ఉంటుంది.. అయినా ఏదో మొండ ధైర్యంతో బాహుబలి తీశారు. చరిత్ర తిరగరాశారు.. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ అలాంటి బ్లాంక్ ఎమోషన్ తో, మొండ ధైర్యంతో ప్రభాస్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. అదే స్పిరిట్.. ఇది సూపర్ కాంబినేషన్ కాదు.. రెబల్ కాంబినేషన్ కాదు.. వైల్డ్ కాంబినేషన్.. సందీప్ రెడ్డి మేకింగ్ లో ప్రభాస్ నిజంగా అందరి ఊహలకు అందని పాత్ర చేస్తున్నాడా? బాహుబలిని మించే బ్రేక్ అవుట్ ఫిల్మ్ గా స్పిరిట్ నిజంగా మారుతుందా?
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఓరకంగా తను సేఫ్ జోన్ లో ఉన్నాడు… స్పిరిట్ తో ఇప్పుడా సేఫ్ జోన్ గోడలు బద్దలు కొట్టే ఛాన్స్ఉంది. అంతగా ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవ్లలో ఐదు హిట్లు, రెండు సార్లు వెయ్యికోట్లు రాబట్టిన సినిమాలు ప్రభాస్ ఎకౌంట్ లో పడ్డాయి. కాబట్టి ఇప్పుడు సందీప్ రెడ్డి మేకింగ్ లో చేసే సినిమా ప్రభాస్ మూవీ కాదు.. ప్రభాస్ ఇమేజ్ ని, మార్కెట్ ని బ్రేక్ అవుట్ చేసే ఫిల్మ్..కొన్ని సార్లు సొంత ఇమేజ్ నే బద్దలు కొట్టే సినిమా చేస్తేనే, హీరోల ఫేట్ మారుతుంది. లేదంటే పాత ఇమేజ్ లోనే ఇరుక్కుపోయి ఆ భారాన్ని మోస్తూ ఉండాలి… అందుకే బాహుబలిని మించే మూవీ కోసం సలార్లు, కల్కీలు ఇలా చాలా ప్రయోగాలు చేస్తున్నా… ఇంతవరకు ఇది ప్రభాస్ ఫేట్ ని మార్చేదికాదు, బాక్సాఫీస్ బీట్ ని కూడా మార్చే మూవీ అనిపించేంతగా ఏది రాలేదు..
అలాంటి వైల్డ్ కాంబినేషన్ స్పిరిట్ తోనే సెట్ అయ్యింది. సందీప్ రెడ్డి లాంటి ఆటమ్ బాంబుల స్పెషలిస్ట్ కి, ఆరున్నర అడుగుల న్యూక్లియర్ పవర్ ప్లాంటే దొరికింది… అందుకే రెబల్ స్టార్ తన ఇమేజ్ ని బ్రేక్ చేసి రా అండ్ రగ్గుడ్ స్టార్ గా మారే టైం వచ్చింది… ఇది పాన్ ఇండియా కోసం కాదు, ప్రభాస్ లో కొత్త కోణాన్ని చూపించేందుకే ఈ ప్రయత్నం అనంటున్నారు.ఓరకంగా ప్రభాస్ ని ఫిల్టర్ లేకుండా పవర్ ఫుల్ రోల్ లోచూపించేందుకు సందీప్ ప్రయత్నిస్తున్నాడు. అది తన మాటల్లో, ఆడియో గ్లింప్స్ లో కనిపించింది.. ఇక కనిపించాల్సింది థియేటర్ లో… కాకపోతే ఈ ప్రయత్నం లో ప్రయోగం మిస్ ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి, విజయ్ తో తీశాడు.. కబీర్ సింగ్ షాహిద్ కపూర్ తో తీశాడు.. వీళ్లు అనామనులు లేదంటే, హిట్లు లేని టైంలో సందీప్ మేకింగ్ లో హిట్లు కొట్టిన స్టార్లు..
రణ్ బీర్ కపూర్ మీద కూడా యానిమల్ గా పెద్దగా అంచనాలు లేవు కాబట్టి, అదెంత నెగెటివిటీకి కేరాఫ్ అడ్రస్ అయినా నడిచింది. కాని ప్రభాస్ పాన్ ఇండియా కింగ్… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఖాన్లు, కపూర్లు కూడా మోయలేనంత ఇమేజ్ తన సొంతం.. అలాంటి తనతో సందీప్ రెడ్డి వంగ నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు.. ఫైర్ అదరిపోతే, వసూల్ళుల వరదైపారుతాయి… లేదంటే అసలుకే ఎసరొస్తుంది. కాని ఈ కాంబినేషన్ వైల్డ్ కాంబినేషన్ కాబట్టి, వరస్ట్ సినారియోలో కూడా కనీసం 2 వేల కోట్ల వరదొస్తుంది.. అదే టాక్ కిక్ ఇస్తే, ఇదో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది.