మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం మరోసారి నాటు స్టెప్పులేయబోతున్నాడు… త్రిబుల్ ఆర్ తో వీళ్ల స్నేహం గ్లోబల్ గా పాపులరైంది… ఈ కాంబినేషన్ లో 1450 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. కట్ చేస్తే ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి దేవరతో పాన్ ఇండియా సోలో హిట్ పడింది.. రాజమౌళి సెంటి మెంట్ ని బ్రేక్ చేసిన రికార్డు కూడా దక్కింది. కాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆచార్యతో ఫస్ట్ పంచ్ పడింది. తర్వాత శంకర్ ని నమ్ముకుంటే, గేమ్ ఛేంజ్ అయిపోయింది. అసలు అడ్రసే గల్లంతైంది. అందుకే పెద్ది విషయంలో ఎన్టీఆర్ హెల్ప్ చేస్తున్నాడట. మొన్న కథని, ప్రాజెక్ట్ ని తనికి ఇచ్చేశాడు.. ఇప్పుడు తనే పెద్ది కోసం పెద్ద అడుగు వేయబోతున్నాడు.. ఏంటది?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ కోసం, పెద్ద అడుగే వేస్తున్నాడు. డ్రాగన్ మూవీ షూటింగ్ తో బిజీ అయిన ఎన్టీఆర్, మళ్లీ నాటు స్టెప్పులేయబోతున్నట్టున్నాడు.. నిజానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ గ్లోబల్ గా దూసుకెళ్లింది. నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కింది. అసలు నాటు నాటు అంటేనే ఈ ఇద్దరి పేర్లు వినిపించేంతగా ఫోకస్ అయ్యారు.కాకపోతే ఆ తర్వాతే ఎన్టీఆర్ కి దక్కిన దేవర లాంటి హిట్ రామ్ చరణ్ కి దక్కలేదు. ఆచార్య ఫ్లాపైంది.. తర్వాత శంకర్ మేకింగ్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో రాజమౌళి సెంటిమెంట్ కి బలైన స్టార్ గా మిగిలిపోయాడు రామ్ చరణ్. గతంతో మగధీర చేసినప్పుడు కూడా ఇంతే, ఆ బ్లాక్ బస్టర్ తర్వాత ఆరేంజ్ లాంటి ప్లాప్ పడింది.
వరుసగా ఫెల్యూర్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కాని ఎన్టీఆర్ మాత్రం త్రిబుల్ ఆర్ తర్వాత దేవర వచ్చింది.. పాన్ ఇండియా హిట్ పడింది. అదే రామ్ చరణ్ కి కుదర్లేదు.. కాబట్టే పెద్ది ఇప్పుడు తన ఫేట్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా మారింది. ఇది కూడా ఏమాత్రం అటు ఇటు ఐనా, పాన్ ఇండియా హ్యాట్రిక్ ఫ్లాపులతో తన ఫ్యూచరే డైలామాలో పడిపోతుంది.అందుకే పెద్ది విషయంలో ఎన్టీఆర్ గతంలో నే ఒక అడుగు ముందుకేశాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తున్నాడు.. నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది.. ఎక్కువ శాతం ఇది రామ్ చరణ్ కే సూట్ అవుతుందని, స్నేహం కోసం త్యాగం చేశాడు. ఇప్పడుు పెద్ది ప్రమోషన్ ఈవెంట్స్ లో తను కూడా జాయిన్ కాబోతున్నాడు. ఓరకంగా తనతో సినిమా తీయాలనుకుని తీయలేకపోయిన బుచ్చి బాబు కోసం కూడా తను ఒక అడుగు ముందుకేస్తున్నాడు.
పెద్ది టీం ఉగాదికి సినిమాను రిలీజ్ అనుకున్నా కాని, మే ఎండ్ కి వాయిదా వేయబోతోందని తెలుస్తోంది. కాకపోతే ఉగాది నుంచే ప్రమోషన్ మొదలవ్వబోతోందట. మొదటి ఈవెంట్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెస్ట్ గా పిలుస్తున్నట్టు తెలుస్తోంది. పెద్ది మూవీ ప్రమోషన్ లో ఈ ఇద్దరు హీరోలు నాటు కాంబినేషన్ ని రిపీట్ చేసేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. మొత్తానికి మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరినీ ఒకే స్టేజ్ మీద గ్రాండ్ గా చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కి దక్కుతోంది.