Kamal Haasan: డబుల్ ట్రీట్..! కమల్ హాసన్ 2.0.. వెర్షన్ ఒకే నెలలో డబుల్ ట్రీట్..!

66 ఏళ్ల వయసులో యాక్షన్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్న ఈ నటనేశ్వరుడు.. ఒకే నెలలో తన ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో చేసిన చిత్రం “కల్కి 2898 ఎడి” మూవీలో కమల్ ఓ స్పెషల్ రోల్‌లో నటించాడు.

Post Published By: narender Thiru
Updated : 21 April 2024, 2:11 PM IST

Kamal Haasan: కమల్ హాసన్ కెరీర్ ప్రస్తుతం టాప్ స్పీడ్‌లో ఉంది. ఒకటి, రెండు కాదు.. ఒకేసారి మూడు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడీ యూనివర్స్‌ల్ హీరో. విక్రమ్ తర్వాత తన 2.0 వర్షన్ చూపిస్తున్నాడు కమల్. ప్రస్తుతం ఎవర్ గ్రీన్ దర్శకుడు మణిరత్నంతో “థగ్ లైఫ్” అనే భారీ మూవీ చేస్తున్న కమల్.. మరో రెండు సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్‌కి రెడీగా ఉన్నాడు. ఆ రెండు కూడా భారీ సినిమాలే కావడం విశేషం.

RAM CHARAN: 1000 మందితో రామ్ చరణ్ ఫైట్.. మైండ్‌బ్లోయింగ్ సీక్వెన్స్..

66 ఏళ్ల వయసులో యాక్షన్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్న ఈ నటనేశ్వరుడు.. ఒకే నెలలో తన ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో చేసిన చిత్రం “కల్కి 2898 ఎడి” మూవీలో కమల్ ఓ స్పెషల్ రోల్‌లో నటించాడు. అలాగే భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌తో.. హీరోగా తీసిన “ఇండియన్ 2” మూవీ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చి రికార్డులు సృష్టించిన భారతీయుడు మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఇండియన్‌-2 మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని జూన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్‌ ఫిక్సయిపోయారు. అలాగే కల్కి కూడా దాదాపుగా అదే నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నాట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అదే జరిగితే.. కమల్ ఫ్యాన్స్‌కి అంతకు మించిన బిగ్గెస్ట్ ట్రీట్ ఉండదంటున్నాయి ఫిలిం వర్గాలు. కమల్ యాక్టింగ్ అంటే అది మాటల్లో చెప్పక్కర్లేదు. అందులోనూ రెండూ డిఫరెంట్ క్యారెక్టర్లు.. రెండు రెండూ భారీ చిత్రాలు దేనికదే పూర్తి భిన్నం. ఇక కమల్ లాంటి విలక్షణ నటుడు రెండు బలమైన పాత్రల్లో నటిస్తే.. ఆ నటన చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అలాంటిది ఆ రెండు సినిమాలూ ఒక్క నెలలోనే రిలీజ్ అంటే ఒక్క అభిమానులకే కాకుండా మూవీ లవర్స్‌కి కూడా గ్రాండ్ ట్రీట్ ఖాయం అని చెప్పాలంటున్నాయి ఫిలిం వర్గాలు.

Published : 
  • 21 April 2024, 2:11 PM IST