LEO: లియోకు పాన్ ఇండియా సీన్ ఉందా..?

కర్ణాటకలో కూడా విజయ్ దళపతికి బాగానే మార్కెట్ ఉంది. ఎటొచ్చి.. కేరళతో పాటు, నార్త్ ఇండియాలో విజయ్ దళపతి ఇప్పటి వరకు హిట్ కాదుకదా, కనీసం గుర్తింపు కూడా దక్కించుకోలేదు. మలయాళంలో రియాలిటీకే పెద్ద పీట వేస్తారు.

Post Published By: narender Thiru
Updated : 29 September 2023, 6:39 PM IST

LEO: కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి తమిళ్‌లో ఎంత పెద్ద స్టార్ అయినా, తెలుగు జనాల్లో గుర్తింపు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. తుపాకి, పోలిసోడు, విజిల్, మాస్టర్ ఇలా చాలా హిట్లు పడ్డాకే అంతో.. ఇంతో.. మార్కెట్ ఇక్కడ కూడా క్రియేట్ అయ్యింది. కర్ణాటకలో కూడా విజయ్ దళపతికి బాగానే మార్కెట్ ఉంది. ఎటొచ్చి.. కేరళతో పాటు, నార్త్ ఇండియాలో విజయ్ దళపతి ఇప్పటి వరకు హిట్ కాదుకదా, కనీసం గుర్తింపు కూడా దక్కించుకోలేదు. మలయాళంలో రియాలిటీకే పెద్ద పీట వేస్తారు.

కాని విజయ్ మూవీలన్నీ ఓవర్ ద టాప్ సీన్లతో ఉంటాయి. కాబట్టే తనకి అక్కడ పెద్దగా క్రేజ్, మార్కెట్‌లో మైలేజ్ లేదు. అలానే బాలీవుడ్ జనానికి నచ్చేలా విజయ్ సినిమాలు లేకపోవటంతోనే, అక్కడ తనకి డిమాండ్ లేదంటున్నారు. తారక్, చరణ్, బన్నీ, విజయ్ దేవరకొండ, ఇలా తెలుగు హీరోలకి పాన్ ఇండియా మూవీలు చేయక ముందే, నార్త్‌లో గుర్తింపు ఉంది. వాళ్ల సినిమాలు హిందీలో డబ్బై అక్కడ జనాలకు మన హీరోలు దగ్గరయ్యారు. ఆ విషయంలో విజయ్ దళపతి హిందీ డబ్బింగ్ కహానీలు ఇలాంటి ఫీట్లు చేయలేదు. కాని లియోతో నార్త్‌లో సందడి పెరిగేలా ఉంది.
విక్రమ్, ఖైదీతో లోకేష్ కనకరాజ్‌కి నార్త్ బెల్ట్‌లో మంచి గుర్తింపు దక్కింది. సో.. తన మేకింగ్‌లో లియో వస్తోంది కాబట్టి, రిలీజ్‌కి ముందే రూ.535 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యిందన్న వార్తతో హైప్ వచ్చింది కాబట్టి, విజయ్ దళపతి ఫేట్ ఈసారి మారేలా ఉంది.

Published : 
  • 29 September 2023, 6:39 PM IST