Lokesh Kanagaraj: కొత్త యాంగిల్.. రాఘవ లారెన్స్‌తో లోకేష్ కనగరాజ్..

లోకేష్ కనగరాజ్ తన కమింగ్ మూవీ కోసం మరో దర్శకుడు కమ్ నటుడు రాఘవ లారెన్స్‌‌ని ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రానికి బెంజ్ అనే టైటిల్ పెట్టారు. లోకేష్ కనగరాజ్ కథను రాసుకోవడంతోపాటు నిర్మాతల్లో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 15 April 2024, 5:44 PM IST

Lokesh Kanagaraj: తమిళ దర్శకుడు, లోకేశ్ కనగరాజ్‌కి మామూలు క్రేజ్ లేదు. ఆయన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ అని చెప్పొచ్చు. ఆయన సినిమాలకు తమిళంలోనే కాదు.. తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. కాగా.. ఆయన నుంచి మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీలో హీరో పేరు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. లోకేష్ కనగరాజ్ తన కమింగ్ మూవీ కోసం మరో దర్శకుడు కమ్ నటుడు రాఘవ లారెన్స్‌‌ని ఎంచుకోవడం విశేషం.

RENU DESAI: ఎలక్షన్‌ టైమ్‌లో ఆ టాటూ.. పవన్‌కు రేణుదేశాయ్‌ ఏం చెప్పాలనుకుంటోంది..?

ఈ చిత్రానికి బెంజ్ అనే టైటిల్ పెట్టారు. లోకేష్ కనగరాజ్ కథను రాసుకోవడంతోపాటు నిర్మాతల్లో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు. డైరెక్షన్ బాధ్యత మాత్రం మరొకరి చేతిలో పెట్టడం గమనార్హం. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్నారు. లారెన్స్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉందని, ఆయనపై నమ్మకం ఉంచినందుకు టీమ్‌కి ధన్యవాదాలు అని కనగరాజ్ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌తో పాటు సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. పోస్టర్ ఒక సైనికుడి ముసుగు కప్పి ఉంది. కారణం ఉన్న యోధుడు అత్యంత ప్రమాదకరమైన సైనికుడు అనే శీర్షికతో పోస్టర్ ఇంట్రెస్టింగ్ ఉంది. మూవీలో ఇతర నటీనటుల వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇది కనగరాజ్ కెరీర్‌లో మరొక కోణం.

అతను ఇటీవలే ఇనిమెల్ అనే పాటలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ పాటలో శృతి హాసన్ అతనితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దర్శకుడిగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేయబోయే సినిమాని ఇటీవలే ప్రకటించాడు. రజనీని గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా డాన్‌గా చూపిస్తూ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తాత్కాలికంగా తలైవర్ 171 అని పేరు పెట్టారు సన్ పిక్చర్స్ నిర్మించనుంది.

Published : 
  • 15 April 2024, 5:44 PM IST